
లక్నో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో అడుగిడిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వైమానిక దళం గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లాకు సోమవారం లక్నోలో అపూర్వ స్వాగతం లభించింది. యాగ్జియం–4 మిషన్‌ను దిగి్వజయం ముగించుకుని ఇటీవల ఢిల్లీకి చేరుకున్న ఆయన..మొదటిసారిగా సొంతూరుకు చేరుకున్నారు.
ఎయిర్‌పోర్టులో తల్లిదండ్రులు శంభు, ఆశా శుక్లా, భార్య కామ్నా, కుమారుడు కియా‹Ùతోపాటు పెద్ద సంఖ్యలో అభిమానులు త్రివర్ణ పతకాలు చేబూని, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. సిటీ మాంటెస్సోరి స్కూలుకు చెందిన విద్యార్థులు డ్రమ్ములు వాయిస్తూ బాకాలు ఊదుతూ సందడి చేశారు. సొంతూరు రావడం ఎంతో ఉత్కంఠగా ఉందని శుభాంశు పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటలకు లక్నోలో కాలు పెట్టిన దగ్గర్నుంచి అభిమానులతో కనీసం 2 వేల సెలీ్ఫలు తీసి ఉంటానని అన్నారు. ఓపెన్ టాప్ వాహనంలో పూల వాన కురిపిస్తుండగా త్రివేణీ నగర్‌లోని సొంతింటి వైపు ఆయన విక్టరీ పరేడ్ సాగింది.
స్పేస్ టెక్నాలజీ చదివే విద్యార్థులకు శుభాంశు శుక్లా పేరుతో స్కాలర్ షిప్పులను అందజేస్తామని ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. నాసా బదులుగా ఇస్రో గురించి అందరూ మాట్లాడుకునే రోజు ఎంతో దూరంలో లేదని డిప్యూటీ సీఎం మౌర్య వ్యాఖ్యానించారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ సమక్షంలో శుభాంశు శుక్లాకు సీఎం యోగి సన్మానం చేశారు. లక్నోలోని ఓ పార్కుకు శుక్లా పేరు పెడతామని మేయర్ తెలిపారు. నగరమంతటా పెద్ద సంఖ్యలో ఏర్పాటైన భారీ డిజిటల్, ఎల్‌ఈడీ స్క్రీన్లపై శుభాంశు శుక్లా ఘనతను ప్రదర్శించారు. శుక్లాను భారత రత్నతో గౌరవించాలని రా్రïÙ్టయ కిసాన్ మంచ్ డిమాండ్ చేసింది.