న్యూఢిల్లీ: భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సందేశాన్ని పంపారు. భారతదేశంలోని ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
అదే సమయంలో భారత్-అమెరికాలది హిస్టారిక్ బాండ్ అంటూ కోడ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ‘బ్లాక్ అండ్ వైట్’ ఫోటోను షేర్ చేశారు ట్రంప్. తమది ఎన్నో దశాబ్దాల సంబంధం అని అర్ధం వచ్చేలా ఉంది ట్రంప్ షేర్ చేసిన ఫోటో.
భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలను అమెరికా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను అని ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి యూఎస్ ఎంబసీ తన అధికారిక అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
ఈరోజు అంతకముందే భారత్‌కు అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. భారత్‌తో తమది చారిత్రాత్మక బంధం అంటూ అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. ఆపై అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే సందేశాన్ని ఇచ్చారు.
“On behalf of the people of the United States, I extend my heartfelt congratulations to the government and people of India as you celebrate your 77th Republic Day. The United States and India share a historic bond as the world’s oldest and largest democracies.” - President… pic.twitter.com/oC9x3Qs9y3
— U.S. Embassy India (@USAndIndia) January 26, 2026
ఇదీ చదవండి:


