చార్‌ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. బద్రినాథ్, కేదారినాథ్, గంగోత్రి తీర్థయాత్రలకు కేవలం హిందుా మతస్థులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపింది. ఇక నుంచి అన్య మతస్థులను ఎట్టి పరిస్థితుల్లో తీర్థయాత్రలకు అనుమతించమని స్పష్టం చేసింది.
బద్రినాథ్, కేదారినాథ్ టెంపుల్ కమిటీ (BKTS) ఛైర్మన్ హిమంత్ ద్వివేదీ మాట్లాడుతూ. "హిందుయేతరులకు ధామ్, ముఖ్భాలో ప్రవేశం పూర్తిగా నిషేదం ఉత్తరాఖండ్ లోని ఆలయాల సంస్కృతిని పరిరక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో కూడా కేదారినాథ్ చుట్టుప్రక్కల ఆలయాలలో అన్య మతస్థులకు ప్రవేశం ఉండేది కాదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ఈ నియమం తరచుగా ఉల్లంఘించబడింది." అన్నారు. అంతేకాకుండా BKTS పరిధిలోని అన్ని ఆలయాలలోకి హిందుయేతరులు ప్రవేశించకుండా త్వరలో జరిగే బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఉత్తరాఖండ్ ఆలయాల పరిరక్షణకు రాష్ట్రప్రభుత్వం ఆలయాల కమిటీలతో కలిసి పనిచేస్తుందని ఆలయ కమిటీ ఛైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ఆలయ కమిటీల సిపార్సులకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 19న అక్షయతృతీయ సందర్భంగా తెరుచుకోగా బద్రినాథ్ ఆలయం ఏప్రిల్ 23న తెరుచుకుంటుంది . వీటితో పాటు రుద్రప్రయాగ్‌లోని కేదారినాథ్ ఆలయం ఎప్పుడు తెరుచుకుంటుంది అనే విషయం మహా శివరాత్రి రోజున ప్రకటిస్తారు.
యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నాలుగు ధామాలను కలిపి చార్ ధామ్ అంటారు. హిందువులకు ఈ యాత్ర ఎంతో ప్రత్యేకం. చార్ ధామ్ యాత్రను యమునోత్రి నుంచి ప్రారంభించి, తర్వాత గంగోత్రి, కేదార్‌నాథ్ మరియు చివరగా బద్రీనాథ్ దర్శనంతో ఈ యాత్ర ముగుస్తుంది. చార్ ధామ్ యాత్ర సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో ప్రారంభమై వాతావరణ పరిస్థితులను బట్టి అక్టోబర్ లేదా నవంబర్ వరకు కొనసాగుతుంది.


