ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ, హోం సెక్రటరీపై ఈసీ బదిలీ వేటు వేసింది. అలాగే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి పోస్టింగ్ వద్దని ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం, కొత్త చీఫ్ సెక్రటరీగా దుష్యంత్ నరియాల, హోం సెక్రటరీగా సంఘమిత్ర ఘోష్‌లను నియామకం చేసింది.
ఈ మేరకు ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖలో స్పష్టం చేసింది. తన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, అధికారులు విధుల్లో చేరిన వివరాలతో కూడిన నివేదికను సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు పంపాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇక, ఇప్పటివరకు నందిని చక్రవర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Following the announcement of the West Bengal Assembly Elections 2026 schedule on 15 March 2026, the Election Commission of India announced the transfer of senior officers. Dushyant Nariala (IAS-1993) appointed Chief Secretary, Govt. of West Bengal, and Sanghamitra Ghosh… pic.twitter.com/pqXt0fWD8b
— ANI (@ANI) March 15, 2026


