సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. జాతీయజెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ముందుగా అమర వీరుల స్తూపం వద్ద గవర్నర్ నివాళులర్పించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్, డీజీపీ, మంత్రులు పాల్గొన్నారు.
శాసనమండలిలో..
తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. జాతీయ జెండాను ఎగుర వేశారు. డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, వాణి దేవి, తక్కెళపెళ్ళి రవిందర్ రావు, అంజిరెడ్డి, మల్కాకొమురయ్య , శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో..
అసెంబ్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు.


