ఆదివారం బస్‌భవన్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఐద్వా నేతల సంఘీభావం
భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న మోదీ
ఐద్వా బహిరంగ సభలో బృందాకారత్
సాక్షి, హైదరాబాద్/ సుందరయ్య విజ్ఞానకేంద్రం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్యాట్రన్ బృందాకారత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన లౌకికత్వం, ప్రజాస్వామ్యం, సమానత్వ విలువలపై కేంద్ర ప్రభుత్వం బుల్డోజర్ నడిపిస్తుందని ఆమె విమర్శించారు. నగరంలోని బస్‌భవన్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. దేశానికి పెద్ద ప్రమాదం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ అని విమర్శించారు.
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రధాని మోదీ ఇండియా గేట్ వద్ద తీసుకునే సెల్యూట్ రాజ్యాంగం కోసమో..ప్రజల కోసమో కాదని, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ కోసమే శపథం తీసుకోబోతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో మహిళలకు అతిపెద్ద ప్రమాదం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచేనని పేర్కొన్నారు. మహిళలు అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటన్నింటికన్నా ప్రమాదకరంగా రాజ్యాంగానికి ఏర్పడుతున్న ముప్పు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ముందుండి పోరాడుతుందని తెలిపారు. మట్టి తట్టలు ఎత్తి జీవనోపాధి సాగించే కోట్లాది మంది పేదలకు అండగా నిలిచిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ఎత్తివేసేందుకు ప్రయతి్నస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలను అప్పుల పాలు చేస్తున్నారు: మరియం ధావలే
ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ దేశంలోని పేద మహిళలకు పనిలేకుండా చేస్తున్నారని, పనిలేకపోతే కుటుంబాన్ని ఎలా పోషిస్తారని, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ప్రజలు బ్యాంకుల్లో జమ చేసుకున్న డబ్బును కేంద్ర ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు ఇస్తున్నారని ఆరోపించారు. ఆ కంపెనీల ద్వారా పేద మహిళలకు 10, 20 శాతం వడ్డీకి అప్పుగా ఇస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేద మహిళలు మైక్రో ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు పొంది, వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు.
⇒ సభకు అధ్యక్షత వహించిన ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో మహిళల అభివృద్ధి క్షీణిస్తుందని, అక్షరాస్యతలో కూడా వెనక్కి వెళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పదేళ్ల క్రితం 70 శాతం ఉన్న మహిళా అక్షరాస్యత 65 శాతానికి తగ్గిందన్నారు.
⇒ ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుభాíÙణి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో మహిళల జీవన స్థితిగతులు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్షి్మ, అధ్యక్షురాలు అరుణజ్యోతి, ఆహా్వనసంఘం గౌరవ అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి ప్రసంగించారు. బహిరంగసభకు ముందు ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఐద్వా 14వ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ సమావేశాలను ప్రముఖ నటి , స్క్రీన్ రైటర్ రోహిణి మొల్లెటి ప్రారంభించగా, హాజరైన ప్రతినిధులకు ప్రొఫెసర్ శాంతసిన్హా స్వాగతం పలికారు. ఆ తర్వాత బహిరంగసభకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లి మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సభాస్థలి వరకు ఎర్రజెండాలతో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.


