బాల్య వివాహలు చేస్తే ఖబడ్దార్..!
పార్వతీపురం: బాల్యవివాహాలు చేస్తే క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వివాహనికి తహసీల్దార్ అనుమతి తీసుకోవాలన్నారు. పెళ్లికి సంబంధించి అనుబంధసంస్థల యజమానులతో సమావేశం నిర్వహించి బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని కోరారు. వివాహనికి వయస్సు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాన్ని తయారుచేయాలని ఐసీడీఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌పీ ఎస్‌వీ.మాధవరెడ్డి, జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
బాలకార్మిక నిర్మూలన మనందరి బాధ్యత
బాలకార్మికుల నిర్మూలన మనందరి బాధ్యత అని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. బాలకార్మిక నియంత్రణ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను పనిలో చేర్చుకోవడం నేరమన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు మండలస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాలకార్మిక వ్యవస్థ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రహదారి భద్రత నియమాలు పాటించాలి
రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రహదారి భద్రతపై కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రజలకు అవగాహన పెంపొందించాలన్నారు. నెలరోజులపాటు జిల్లా వ్యాప్తంగా ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సేవలను వినియోగించుకుని రహదారి భద్రత ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు.
కుష్ఠువ్యాధి నివారణకు
అవగాహన
కుష్ఠు వ్యాధి నిర్మూలనపై గురువారం నుంచి ఫిబ్రవరి 13వ తేదీవరకు జిల్లాలోని ప్రతి పంచాయతీ కార్యాలయం, పాఠశాల, వసతి గృమాల వద్ద సర్పంచ్‌ల అధ్యక్షతన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కుష్ఠువ్యాధిపై అవగాహన కార్యక్రమాల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
కలెక్టర్ హెచ్చరిక


