జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు షణ్ముఖ రావు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల అథ్లెటిక్స్ పోటీలకు విజయనగరానికి చెందిన ఎం.షణ్ముఖరావు ఎంపికయ్యాడు. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుపతిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 800 మీటర్ల పరుగుపందెంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించాడు. ప్రస్తుతం డిప్లమో విద్యనభ్యసిస్తున్న షణ్ముఖ్ మార్చి నెలలో కేరళలో జరగనున్న ఆలిండియా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధుల పోటీలకు అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనరబచడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుడితో పాటు విజ్జి స్టేడియంలో శిక్షణ ఇచ్చిన కోచ్ ఎ.నర్సింగరావును జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లీలాకృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్ కిషోర్‌లు అభినందించారు.


