కానిస్టేబుల్‌ సతీమణికి కారుణ్య నియామకం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ సతీమణికి కారుణ్య నియామకం

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

కానిస్టేబుల్‌ సతీమణికి కారుణ్య నియామకం

కానిస్టేబుల్‌ సతీమణికి కారుణ్య నియామకం

పార్వతీపురం రూరల్‌: జిల్లా పోలీసు శాఖలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జి.పోలిరాజు సతీమణి స్వాతికి మంగళవారం కారుణ్య నియామక ఉత్తర్వులను ఎస్పీ ఎస్‌.వి.మాధవరెడ్డి అందజేశారు. ప్రభుత్వం ఆమెను పాలకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ (టైపిస్ట్‌)గా నియమించింది. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ..మృతి చెందిన సిబ్బంది కుటుంబానికి రావాల్సిన శాఖాపరమైన ప్రయోజనాలు త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, ఆర్‌ఐ నాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement