దివ్యాంగ విద్యార్థులకు జిల్లాస్థాయి కళాపోటీలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ విద్యార్థులకు జిల్లాస్థాయి కళాపోటీలు ప్రారంభం

Feb 4 2026 7:31 AM | Updated on Feb 4 2026 7:31 AM

దివ్యాంగ విద్యార్థులకు జిల్లాస్థాయి కళాపోటీలు ప్రారంభం

దివ్యాంగ విద్యార్థులకు జిల్లాస్థాయి కళాపోటీలు ప్రారంభం

విజయనగరం అర్బన్‌: స్థానిక యూత్‌ హాస్టల్‌లో మంగళవారం విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్ధులకు జిల్లా స్థాయి కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు ప్రారంభమ య్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలకు ముఖ్యఅఽతిధిగా హాజరైన సమగ్రశిక్ష ఏపీపీ డాక్టర్‌ ఎ.రామారావు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, పోటీతత్వం పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో పరస్పరం పోటీ పడి, మంచి ఇతివృత్తంతో కూడిన చిత్రాలను రూపొందించడం అభినందనీయమన్నారు. తొలిరోజు పోటీ ప్రదర్శనలో కళాంశాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్‌.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి పర్యవేక్షణలో జరిగిన సమగ్రశిక్ష సెక్టోరియల్‌ అధికారులు, సిబ్బంది, 70 మంది దివ్యాంగ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, సహిత విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement