చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వేపాడ: మండలంలోని అరిగిపాలెం సమీపంలో ఆటో నుంచి జారిపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వల్లంపూడి పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడకు చెందిన గొట్టిపాటి నాగరాజు ఆదివారం సోంపురం జంక్షన్ నుంచి వేపాడ వస్తుండగా అరిగిపాలెం సమీపంలో ఆటో నుంచి జారి రోడ్డుపై పడడంతో తలకు త్రీవమైన గాయం కాగా విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం కుటుంబసభ్యులు తరలించిన విషయం విదితమే. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందడంతో మృతుడి కుమారుడు తాతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై నాగేశ్వర్రావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ కేజీహెచ్‌లో పోస్ట్‌మార్ట అనతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.


