ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శన
వేపాడ: మండలంలోని జాకేరు గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. గ్రామంలో పైడమ్మ చిన్నమ్మ పేరంటాలు, వీరాంజనేయస్వామీ తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శనలో విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన 15 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో సింగపూర్ సత్యనారాయణ దేవర గుర్రం ప్రథమస్థానం, రెండోస్థానంలో ఎస్.సత్యనారాయణ శక్తి గుర్రం, మూడో స్థానంలో ధీర అప్పలనాయుడి గుర్రం, నాల్గోస్దానంలో వైజాగ్‌కు చెందిన అమర్ ఓజీర్ గుర్రం, ఐదోస్థానంలో వైజాగ్‌కు చెందిన దీక్షిత్ గుర్రం, ఆరో స్థానంలో జామికి చెందిన డెడ్ లైన్‌గుర్రాలు నిలిచి వరుసగా రూ.12వేలు, రూ.పదివేలు, రూ.ఎనిమిదివేలు, రూ.ఆరువేలు, రూ.నాలుగువేలు, రూ.రెండువేలు చొప్పున నగదు బహుమతులు సాధించాయి.
ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శన


