సర్వం సిద్ధం
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026
–IIలో
● ఘనంగా కారుగేద వాలకం
● పశువులేర్లుతో గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర
నేటి తొలేళ్ల
సంబరానికి
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల ముద్దుబిడ్డ శంబర పోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న తొలేళ్ల ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతరకు ఇతర జిల్లాలతో పాటు, ఒడిశా, చత్తీస్‌ఘడ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. జాతరకొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ ఎం.మహేశ్వరరావు, సబ్ కలెక్టర్ వై.వైశాలి, ఏఎస్పీ వి.మనీషారెడ్డి, ఈఓ బి.శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ నైదాన తిరుపతిరావు పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఘనంగా కారుగేద వాలకం
శంబర గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామస్తులంతా ఘనంగా కారుగేద వాలకం నిర్వహించారు. గ్రామానికి చెందిన చెల్లూరి రాములు ఉదయం నుంచి ఉపవాసం ఆచరించి, ఆరిక గడ్డితో శరీరమంతా కప్పుకొని, ప్రధానవీధి వద్ద అమ్మవారి గద్దె వద్దకు చేరుకున్నారు. అక్కడ కాసేపు నృత్యం చేసి, కింద పడిపోయారు. సీ్త్ర వేషాధారణలో ఓ వ్యక్తి వచ్చి, రాములును లేపి యాదవవీధికి చేరుకున్న అమ్మవారి ఘటాల వద్దకు తీసుకెళ్లి, పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి రాములును ఇంటికి తీసుకువెళ్లడం ఆనవాయితీ.
పారిశుధ్య పనులు
గ్రామంలో అన్ని వీధుల్లో డీపీఓ కొండలరావు ఆధ్వర్యంలో విస్తృతంగా పారిశుధ్య పనులు నిర్వహించారు. ఈ పనుల్లో 200 మంది కార్మికులు పాల్గొన్నారు. గ్రామంలో ప్లాస్టిక్‌ను నిషేధించారు. మరోవైపు జాతరకొచ్చే భక్తులకు వినోదాన్ని పంచే సర్కస్‌లు ఇప్పటికే గ్రామానికి చేరుకున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వ్యాపారులు శంబర గ్రామానికి చేరుకుని దుకాణాలు ఏర్పాటు చేశారు.
683 మందితో పోలీస్ బందోబస్తు
జాతరలో 683 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. 40 సీసీ కెమెరాలు, డ్లోన్లుతో పోలీస్ ఉన్నతాధికారులు కంట్రోల్ రూమ్ నుంచి జాతర పర్యవేక్షించనున్నారు.
20వేల లడ్డూలు సిద్ధం
శంబర పోలమాంబ అమ్మవారి జాతర 10 వారాల పాటు జరుగుతుంది. తొలి జాతరకు వచ్చే భక్తులకు 20వేల లడ్డూ ప్రసాదం, అవసరమైన మేరకు పులిహోరా ప్రసాదాన్ని ఈఓ బి.శ్రీనివాస్ తయారు చేయించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతరలో దేవదాయ శాఖ సిబ్బంది 70మంది వరకు విధులు నిర్వహించనున్నారు. భక్తులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు, దుస్తులు మార్పిడి గదులు నిర్మించారు. క్యూలైన్లు వద్ద చిన్నారులకు పాలు అందించనున్నారు. మంచినీరు అందుబాటులో ఉంచారు.
ఆరు చోట్ల పార్కింగ్ ప్రదేశాలు
శంబర గ్రామానికి చేరుకునే వాహనదారులకు ఆరు చోట్ల పార్కింగ్ ప్రదేశాలను కేటాయించారు. సన్యాసిరాజపురం, కవిరిపల్లి, తోటవలస గ్రామాలలో ముత్యాలమ్మ పండగ జరగనున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు బంధువులు చేరుకునే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. గ్రామం నుంచి స్థానికులు ఇతర ప్రాంతాలకు వెళ్లి, తిరిగి గ్రామంలోకి రావాలంటే తమ ఆధార్ కార్డు చూపించాల్సి ఉంది.
ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్లు
అమ్మవారి జాతర ఏర్పాట్లును పార్వతీపురం, పాలకొండ సబ్‌కలెక్టర్లు వైశాలి, స్వప్నిల్ పవార్ ఆదివారం పరిశీలించారు. చదురుగుడి, వనంగుడి క్యూలైన్లను, తాగునీటి కల్పన, సిరిమాను తిరిగే వీధులను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అమ్మవారి ఘటాలకు పూజలు
చదురుగుడిలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం 3.30గంటల సమయంలో చదురుగుడి నుంచి అమ్మవారి ఘటాలు గ్రామంలోకి తిరువీధికి బయలుదేరగా, భక్తులు అమ్మవారి ఘటాలకు, పాలధారకు పూజలు నిర్వహించారు.
చదురుగుడిలో
పోలమాంబ అమ్మవారు
గ్రామానికి చేరుకున్న సిరిమాను కర్ర
శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కార్యక్రమానికి అవసరమైన సిరిమాను, గుజ్జుమాను కర్రలను రైతులు పశువులేర్లుతో గ్రామానికి ఆదివారం తీసుకు వచ్చారు. సాలూరు మండలం సోమడవలస గ్రామానికి చెందిన చింతల అప్పలనాయుడు పొలంలో సిరిమాను కర్రను గుర్తించారు. సుమారు 30 అడుగులు పొడువు సిరిమాను కర్రను తీసుకువచ్చారు.
సర్వం సిద్ధం
సర్వం సిద్ధం
సర్వం సిద్ధం


