ఆకట్టుకున్న వర్ణచిత్రం
గరుగుబిల్లి: దేశభక్తిని ప్రబోధించే జాతీయ జెండాలో భారతమాత వర్ణచిత్రం పలువురిని ఆకట్టుకుంది. సోమవారం 77వ గణతంత్ర దినో త్సవాన్ని పురస్కరించుకుని గరుగుబిల్లి మండలంలోని నాగూరుకు చెందిన ప్రముఖ నఖ చిత్రకారుడు పల్ల పరిశినాయుడు రూపొందించిన జాతీయజెండాలో భారతమాత వర్ణచిత్రం పలువురు దేశభక్తి ప్రియులను ఆకర్షించింది. ఆయన ప్రత్యేక పర్వదినాల్లో నఖచిత్రాలు, వర్ణచిత్రాలు వేస్తుంటారు.
పాలకొండ రూరల్: దేశభక్తిని చాటుకునే విధా నం గుండెల్లోనే కాదు.. గుడిలో కూడా అని చాటుకున్నారు పాలకొండ వాసులు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక నక్కలపే ట మరకత లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అర్చకుడు పర్రి శరత్‌కుమా ర్ మరకత లింగాన్ని త్రివర్ణ పతాకంలో అలంకరించారు.
గుమ్మలక్ష్మీపురం: పంటలకు సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కురుపాం మండలం ఊసకొండ పంచాయతీలోని పనసభద్ర గిరిజన రైతులు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని కోరారు. గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రొయ్యలగుమ్మి చెక్‌డ్యాం పాడైందని గుర్తుచేశారు. చెక్‌డ్యాం నుంచి సాగునీటిని పంట పొలాలకు మళ్లించేందుకు కాలువను నిర్మించాలని కోరారు.
ఆకట్టుకున్న వర్ణచిత్రం


