● అభివృద్ధి, సంక్షేమంలో అన్ని వర్గాల ప్రజలకూ సమున్నత స్
సాక్షి, పార్వతీపురం మన్యం:
గణతంత్ర దినోత్సవం వేళ మన్యంలో మువ్వన్నెల జెండా మెరిసిమురిసింది. వందే మాతర గేయాలాపనలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీసుల కవాతు, జాగిలాల విన్యాసాలు, వివిధ శాఖల స్టాల్స్, ప్రగతిని ప్రతిబింబించే శకటాల ప్రదర్శనల నడుమ పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వ హించిన 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా సాగాయి. కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలోని పోలీసు ద ళం కలెక్టర్‌కు సెల్యూట్ సమర్పించగా, బ్యాండ్ బృందం జాతీయగీతాన్ని ఆలపించింది. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను సభావేదిక నుంచి కలెక్టర్ వినిపించారు. వినూత్న కార్యక్రమాలు అమలు చేయడం వల్ల పార్వతీపురం మన్యం జిల్లా ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.
జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందజేశామని చెప్పారు. సమ్మిళిత విధానాలతో అన్ని వర్గాల ప్రయోజనాలకూ పెద్దపీట వేశామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తన సందేశంలో తెలిపారు.
●రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపా లనే ఉద్దేశంతో జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌ను ప్రారంభించామన్నారు. వీటిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జిల్లాకే గర్వకారణమన్నారు. భూవివాదాలు లేకుండా ప్రతి రైతుకూ స్పష్టమైన భూహక్కును కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇప్పటివరకు 354 గ్రామాల్లో రీసర్వే చేపట్టి, 280 గ్రామాలకు సంబంధించి క్యూఆర్ కోడ్ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశామన్నారు.
●2,27,495 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రూ.522 కోట్లను 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. జిల్లాలోని ప్రతి ఎకరా కు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
●విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి సారించేలా శ్రీకారం చుట్టిన ముస్తాబు కార్య క్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలైన సంగతిని గుర్తుచేశారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఆనందలహరి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
●గిరిజన మారుమూల ప్రాంతాల్లో డోలీ మోతల కు స్వస్తి పలికేలా 225 రోడ్ల నిర్మాణానికి రూ.88 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించా రు. వాటితో పాటు రూ. 760 లక్షల అంచనా విలు వతో కొత్తగా మంజూరు చేసిన 140 సిమెంట్ రోడ్ల పనులను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. వివిధ పథకాల కింద రూ.272.80 కోట్ల అంచనాల తో 75 రోడ్ల పనులు మంజూరైనట్టు తెలిపారు. సీతానగ రం వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు వినియో గంలోకి తీసుకువస్తామన్నారు.
●రాష్ట్రీయ గ్రామ స్వరా జ్ అభియాన్ పథకం కింద డీపీఆర్‌సీ భవన నిర్మాణా న్ని రూ.200
శాసీ్త్రయ
నృత్య ప్రదర్శన


