వైభవంగా తొలేళ్ల పండగ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా తొలేళ్ల పండగ

Jan 27 2026 8:29 AM | Updated on Jan 27 2026 8:29 AM

వైభవం

వైభవంగా తొలేళ్ల పండగ

వైభవంగా తొలేళ్ల పండగ ● అమ్మవారిని దర్శించుకున్న భక్తులు

భక్తులు అమ్మవారి మార్గాన్ని చీపుర్లతో తుడిచి మొక్కు చెల్లించారు.

అధికారుల పర్యవేక్షణ

తొలేళ్ల ఉత్సవాన్ని పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ వైశాలి, ఏఎస్పీ వి.మనీషారెడ్డి, డీపీఓ ఎన్‌.కొండలరావు, ఈఓ బి.శ్రీనివాస్‌, ట్రస్టుబోర్డు చైర్మన్‌ ఎన్‌.తిరుపతిరావు పర్యవేక్షించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సీఐ రామకృష్ణను ఆదేశించారు. అనంతరం పార్కింగ్‌ స్థలాలు, సీసీకెమెరాల ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు. మంగళవారం జరగనున్న సరిమానోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. సిరిమాను బండిని ఆర్‌అండ్‌బీ, అటవీశాఖ అధికారులు పరిశీలించారు.

బుగ్గిరేగకుండా...

మక్కువ, బొబ్బిలి, సాలూరు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. పెద్దపెద్ద గోతులు, రాళ్లు తేలడంతో వాహనాలు వెళ్లే సమయంలో బుగ్గిరేగుతోంది. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి వాటర్‌ ట్యాంకర్లతో రోడ్లను తడుపుతున్నారు. రోడ్లు బాగుచేయకుండా తూతూమంత్రం పనులు జరపడంపై భక్తులు మండిపడుతున్నారు.

మక్కువ: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శంబర పోలమాంబ అమ్మవారి తొలేళ్ల ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. అమ్మవారి ఘటాలను ప్రధానవీధిలోని అమ్మవారి గద్దె వద్దకు ఆదివారం రాత్రి చేర్చారు. అనంతరం కారుగేద, మహిషాసురుడు, పోతురాజు వేషధారాణలు నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతులు ఉపవాసాలుతో ఉండి సోమవా రం రాత్రి ఏరుత్సోవం నిర్వహించారు. గ్రామపెద్దలంతా జన్నివారి ఇంటికి వెళ్లి జన్నివారిని పిలిచి ఏరోత్సవం నిర్వహించారు. జన్నివారి, గిరిడవారి ఇంటివద్ద నుంచి తెచ్చిన విత్తనాలను అమ్మవారి వద్ద ఉంచి పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. అనంతరం రైతులు తలోపిడికెడు విత్తనాల ను ఇంటికి తీసుకెళ్లారు. పంటలు సాగుచేసిన సమయంలో ఈ విత్తనాలను వారివద్ద ఉన్న విత్తనాల్లో కలిపి విత్తితే పంట కలిసి వస్తుందన్నది రైతుల నమ్మకం.

తగ్గిన భక్తుల రద్దీ

తొలేళ్ల ఉత్సవానికి గతేడాది కంటే ఈ ఏడాది భక్తు లు రద్దీ తగ్గింది. ప్రధానాలయం వెనుక భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచితం, రూ.20, రూ.100 క్యూలైన్లు ఖాళీగా కనిపించాయి. భక్తులు ప్రధానాలయంలో ఉన్న అమ్మ వారిని, వనంగడిలో కొలువైన పెద పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. వనంగుడి వెనుకన ఉన్న వేపచెట్టుకు పూజలు చేశారు. కోళ్లు, చీరలు, తలనీలాలు, ఘటాలు సమర్పించారు. కొందరు

వైభవంగా తొలేళ్ల పండగ 1
1/2

వైభవంగా తొలేళ్ల పండగ

వైభవంగా తొలేళ్ల పండగ 2
2/2

వైభవంగా తొలేళ్ల పండగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement