సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఆత్మహత్య
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని కన్నెపు దొర వలస గ్రామానికి చెందిన సీఐఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్, జాగాన కిరణ్ కుమార్(41) బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో పనిచేస్తున్నాడు. ఏం కష్టమొచ్చిందో తెలియదుగానీ ఆదివారం సాయంత్రం సుమారు ఐదున్నర గంటల సమయంలో బెంగళూరు రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన 2009 నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. కానిస్టేబుల్‌గా దృఢమైన సంకల్పంతో పది మందికీ ఆదర్శంగా ఉన్న కిరణ్ గ్రామంలో ఏ మంచి కార్యక్రమం జరిగిన తనవంతు సహాయ సహకారలందించి అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కు భార్య పావని ఇద్దరు కుమారులు యశ్వంత్‌నాయుడు సుస్మిత నాయుడు ఉన్నారు. సోదరుడు గంగు నాయుడు కుటుంబ సభ్యులతో తిరుపతి దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో సమాచారం తెలియడంతో అక్కడి నుంచి అలాగే బెంగళూ రు వెళ్లినట్లు తెలిపారు. ఈ వార్త విన్న తండ్రి జాగాన గుంపు స్వామి. తల్లి విజయమ్మ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాని కి బెంగళూరులో పోస్టుమార్టం అనంతరం కన్నపుదొరవలకు పంపిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.


