సీతం కళాశాలకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

సీతం కళాశాలకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌

Feb 3 2026 7:47 AM | Updated on Feb 3 2026 7:47 AM

సీతం కళాశాలకు  ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌

సీతం కళాశాలకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌

విజయనగరం అర్బన్‌: పట్టణంలోని సీతం కళాశాలకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ లభించింది. ఈ గౌరవప్రదమైన సర్టిఫికెట్‌ను సోమవారం జేఎన్‌టీయూ జీవీ ప్రొఫెసర్‌ వీవీసుబ్బారావు చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీరామమూర్తి, వైస్‌ప్రిన్సిపాల్‌ సీహెచ్‌వెంకటలక్ష్మి అందుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సీతం కళాశాల మరిన్న విజయాలను సాధించి, మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఐఎస్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా కళాశాల పనిచేస్తున్నట్లు ఇది సానుకూల సూచన అని డేటా సమగ్రత, నిజాయితీ, నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడం కళాశాల బలమని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ విజయాన్ని సాధించిన కళాశాల బృందాన్ని డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణరావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement