కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు! | - | Sakshi
Sakshi News home page

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు!

Feb 3 2026 7:47 AM | Updated on Feb 3 2026 7:47 AM

కాళ్ల

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు!

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు! ● పింఛన్‌ ఇప్పించాలని పలువురి వేడుకోలు ● పీజీఆర్‌ఎస్‌కు క్యూ కడుతున్న బాధితులు

వ్యక్తి పేరు చప్ప గంగరాజు. బలిజిపేట మండ లం అజ్జాడ గ్రామం. ఏడాదిన్నర కింద ట అనారోగ్య సమ స్య కారణంగా కుడి కాలు తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి పనులకు వెళ్లడం కష్టంగా మారింది. భార్య కూలి పని చేస్తూ, కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తనకు పింఛన్‌ ఇస్తే ఆ మొత్తం కుటుంబానికి ఆసరాగా ఉంటుందని అధికారులకు అభ్యర్థించాడు.

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌: ఎటువంటి ఆధారమూ లేక.. బతుకు సాగక.. ప్రభుత్వ సాయం కోసం పలువురు విధివంచితులు కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. పీజీఆర్‌ఎస్‌లో అధికారులను కలిస్తే న్యాయం జరుగుతుందని ఆశిస్తూ, వినతిపత్రాలు అందిస్తున్నారు. ప్రధానంగా పింఛన్‌ కోసమే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. పార్వతీపురం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన కొంతమంది బాధితుల ఆవేదన ఇదీ..

కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన పాత గౌరీశంకరరావు సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధ పడుతున్నాడు. ఆయన పెద్ద కుమార్తె జశ్విత(7) కూడా పక్షవాతం, సికిల్‌సెల్‌, మాటలు రాకపోవడం వంటి సమస్యలతోనూ.. రెండో కుమార్తె రుచిత సికిల్‌సెల్‌ ట్రయిట్‌ అనే వ్యాధితోనూ బాధ పడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈయనకు ఎటువంటి ఆధార మూ లేదు. వైద్యం కోసం చాలా ఖర్చు చేయా ల్సి వస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. కనీసం రుణం ఇప్పించి, స్వయం ఉపాధి కి మార్గం చూపాలని పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించాడు.

మె పేరు గౌరమ్మ. జియ్యమ్మవ లస మండలం పిప్పలభద్ర గ్రామం. భర్త ఆదినాయుడు 2024 సంవత్సరంలో మృతి చెందారు. అప్పటి నుంచి జీవనాధారం లేని ఆమె.. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉంది. నేటికీ మంజూరు కాకపోవడంతో.. జీవనం దుర్భరంగా ఉందని, అధికారులు దయ తలచాలని వేడుకుంటోంది.

జియ్యమ్మవలస గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి అప్పలనాయుడు పదేళ్లుగా కేన్సర్‌తో పోరాడుతున్నాడు. చికిత్స నిమి త్తం చాలా వరకు ఖర్చయింది. తనకు పెన్షన్‌ ఇస్తే.. కాస్తయినా చేదోడుగా ఉంటుందని ఆశిస్తున్నాడు. అధికారులు కనికరం చూపి, పింఛన్‌ వచ్చే మార్గం చూడాలని వేడుకుంటున్నాడు.

చిత్రంలోని అక్కాతమ్ముళ పేర్లు భోగి వెంకటరత్నం, శ్రీకాంత్‌. ఇద్దరూ దివ్యాంగులే. 90 శాతం వరకు వికలాంగత్వం ఉంది. స్వతహా గా ఏ పనులూ చేసుకోలేరు. మరొకరి తోడు ఉంటే గానీ బయటకు రాలేరు. తమ్ముడు భోగి శ్రీకాంత్‌.. అధిక బరువు కారణంగా నలుగురు పట్టుకుని ఎత్తితే గానీ అవ్వదు. వీరికి రూ.6 వేల పింఛన్‌ వస్తోంది. వైద్యశాఖ అందించే పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే.. విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి సర్టిఫికెట్‌ తీసుకురావాలని చెబుతున్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని, మొత్తం పెంచా లని వేడుకుంటున్నారు.

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు! 1
1/4

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు!

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు! 2
2/4

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు!

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు! 3
3/4

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు!

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు! 4
4/4

కాళ్ల మీద నిలబడలేరు.. ఆదుకుంటే బతుకుతారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement