వేంకటేశ్వర ఆలయ శతాబ్ది ఉత్సవాలకు సన్నాహాలు
పార్వతీపురం: బెలగాంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ శతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్న ట్టు ఆలయ కమిటీ సభ్యులు యిండుపూరు గున్నేశ్వరరావు, పి.అప్పారావు తెలిపారు. ఆలయ ప్రాంగ ణంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవస్థానం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు వేదపండితుల ఆధ్వ ర్యంలో ఉత్సవాలు జరుపుతామన్నారు. ఇందులో భాగంగా 23, 24 తేదీల్లో చినజీయర్ స్వామి, 29న చాగంటి కోటేశ్వరరావు, 30న గరికిపాటి నర్సింహరావు, మే 1న పరిపూర్ణానంద స్వామి విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యు లు జగన్నాథం, కేవీఆర్ కృష్ణారావు, సీహెచ్ బాల గంగాదర్ తిలక్ రాయ్ పాల్గొన్నారు.


