ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభం
సీతంపేట: సీతంపేట ఏరియా ఆస్పత్రిలో సోమవారం నుంచి కిడ్నీ రోగులకు డయాలసి స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వర్చువల్ పద్ధతిలో ప్రారంభమైన ఈ సేవలను డీసీహెచ్‌ఎస్ నాగభూషణ్, డీఎంహెచ్‌ఓ భాస్కరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఇది మూడో డయాలిసిస్ కేంద్రం అన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రం పార్వతీపురం, పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఈ సేవలు రోగులకు అందుతున్నాయన్నారు. ఇక్కడకు ఇప్పటి వరకు ఆరుగురు పేషెంట్లు పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి ఐదుబెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయ పార్వతి, సూపరిండెంటెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ డీవీ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పార్వతీపురం: జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్జర్వేటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారికి సకాలంలో రుణాలు అందించాలన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ముద్రా రుణ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సోమశేఖర్ మాట్లాడుతూ.. జిల్లాలోని బ్యాంకుల సీడీ రేషి యో సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రాధాన్య త రంగాలకు రుణాలు అందించడంలో బ్యాంకులు ముందంజలో ఉన్నాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ఈ నెల 15వ తేదీలోగా క్లియర్ చేస్తామన్నారు.
పార్వతీపురం: జంతువుల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పశువులను నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో కిక్కిరిసి తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెంచాలన్నారు. జంతుహింస నివారణ చట్టం–1960పై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అనాథగా తిరుగుతున్న, గాయపడిన జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక షెల్టర్ హోమ్‌లను ఏర్పాటు చేయాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పశు సంవర్థకశాఖ అధికారి మన్మథరావు, తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సోమవారం పుష్పార్చన సేవను వైభవంగా నిర్వహించారు. శ్రీరామచంద్రస్వామిని వివిధ రకాల పుష్ఫాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక మండపంలో ఉత్సవ విగ్రహాలను ఆసీనులుచేసి పుష్పాలతో అర్చనలు చేశారు. ద్వాదశ ఆరాధన, సప్తావరణ సేవ జరిపించారు.
ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభం
ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభం


