ప్రయోగ పరీక్షలకు వేళాయె..
రాజాం సిటీ: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులతో పాటు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థుల ప్రయోగ పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో అధికారులు ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్, సైన్స్ అధ్యాపకులను సన్నద్ధం చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జనరల్ సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రాన్ని ఆర్‌ఐఓ నేతృత్వంలో డెక్ మెంబర్లు పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ఆన్‌లైన్‌లో మార్కులు పోస్టింగ్
గత విధానంలో లోపాలను సవరించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని విద్యార్థులు రాసే పరీక్షలకు సంబంధించి మార్కులను ఆన్‌లైన్‌లో పోస్టింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. మార్కులను పరీక్ష అయిన వెంటనే కంప్యూటరీకరించేలా సూచనలు చేశారు.
నేటి నుంచి జనరల్ విద్యార్థులకు పరీక్షలు
సీసీ కెమెరా నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు
జిల్లాలో హాజరుకానున్న 19697 మంది విద్యార్థులు
98 కేంద్రాల్లో జనరల్ ప్రయోగ పరీక్షలు
ప్రయోగ పరీక్షలకు వేళాయె..


