హతవిధీ..
మరుగుదొడ్ల వద్ద కాపలానా?
గ్రామ సచివాలయాలపై నిర్లక్ష్యమా.. నీరసమా! సచివాలయ ఉద్యోగులతో పార్కింగ్ ఫీజు వసూలు, మరుగుదొడ్ల వద్ద విధులు ఇప్పటికే సర్వేలతో రోడ్డున పడిన సిబ్బంది ఉన్నత విద్యనభ్యసించి ఇవేం పనులంటున్న ఉద్యోగులు
సాక్షి, పార్వతీపురం మన్యం:
మక్కువ మండలం శంబర పోలమాంబ సిరిమాను ఉత్సవంలో మరుగుదొడ్ల వద్ద, వాహన పార్కింగ్ దగ్గర ఫీజులు వసూలు చేసే బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ఉత్సవం సందర్భంగా ఏర్పాటైన దుకాణాల వద్దకు వెళ్లి ఆసీ లు వసూలు చేసే పని కూడా వారిదే. గ్రామ స్వరాజ్య స్థాపన.. ప్రజల ముంగిటకే పరిపాలనను చేరు వ చేయాలన్న సదుద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సచివాలయ వ్యవస్థను.. నేడు చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయి కి తీసుకొచ్చిందో చెప్పేందుకు ఈ ఉదంతాలు నిదర్శనం.
ఎందుకంత చులకన?
గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారంతా ఉన్నత విద్యావంతులే. పీజీ, ఎంటెక్, బీటెక్, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి చదువు లు చదువుకున్నారు. సర్కారు కొలువు.. ఉన్న ఊరి లోనే ఉద్యోగమన్న ఆశతో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన సచివాలయాలకు పెద్దఎత్తున దరఖా స్తు చేసుకున్నారు. వేలాది ఉద్యోగాలను గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భర్తీ చేయడంతో.. చాలా మందికి కొలువులు లభించాయి. సచివాలయాల్లో ప్రజలకు అవసరమైన సుమారు 400 రకాలకు పైగా సేవలను వీరు అందించేవారు. సుమారు 13 విభాగాల సిబ్బంది అందుబాటులో ఉండేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో నే పరిస్థితి మారిపోయింది. నాడు గౌరవంగా పని చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు.. నేడు నిత్యం ఆత్మక్షోభను అనుభవిస్తూ పని చేస్తున్నారు. అందుకు కారణం.. వారి చదువుకు, చేయా ల్సిన విధులకు సంబంధం లేని పనులు అప్పగించడమే. విద్యార్థులకు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రం, ఓబీసీ, రైతులకు రిజిస్ట్రేషన్ సేవలు, రెవెన్యూ రికార్డుల్లో మార్పుల, చేర్పులు, ఆధార్ సేవలు, పింఛన్ల నమోదు, రేషన్ కార్డుల నమోదు, జారీ వంటి సేవలు అందించడం వీరి ప్రధాన విధు లు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తున్నారు. ఉన్న సిబ్బందిని డిప్యుటేషన్‌పై ఇతర విభాగాలకు పంపిస్తున్నారు. మిగిలిన వారికి సైతం వివిధ సర్వేలు అప్పగిస్తూ.. నిత్యం వీధుల్లోనే ఉంచుతున్నారు. దీంతో ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండటం అరుదుగా మారింది. ప్రజలకు సేవలు అందడం లేదు. పీ4 కార్యక్రమ బాధ్యతలు, వాట్సప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా డోర్ టు డోర్ వెళ్లి చెప్పడం, డ్రైడే –ఫ్రైడే, కుటుంబ సభ్యుల సర్వే, ఆధార్ ఆప్‌డేట్ ఈకేవైసీ, ఆధార్ సీడింగ్–వాహన్ డేటా(కొత్త వాహనం కొనుగోలు చేసిన వారికి ఆధార్ లింకు చేయడం), బయోమెట్రిక్ సర్వే, జీఎస్‌టీ అవగాహ న, పింఛన్ల పంపిణీ.. ఇలా లెక్కకు మించి బాధ్యత లు అప్పగించి.. బయటకు పంపేస్తున్నారు. తాజాగా జనగణనకు సైతం వీరి సేవలనే వినియోగించుకోనున్నారు.
ఇప్పుడు శంబర జాతరలో మరో అడుగు ముందుకేసి ఏకంగా మరుగుదొడ్ల వద్ద, పార్కింగు స్థలాల చోట కాపలా ఉంచి, ఫీజు వసూలు చేసే బాధ్యత అప్పగించడంపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఈ పనిని ఆలయ కమిటీ చూసుకునేది. పాటల ద్వారా బయట వ్యక్తులకు అప్పగించేవారు. ఈసారి ఆ పరిస్థితి లేకపోయింది. పెద్ద ఎత్తున ఆదాయం పొందాలన్న ఉద్దేశంతో పాటలన్నీ రద్దు చేసి.. సచివాలయ ఉద్యోగులనే వాహనా ల పార్కింగు వద్ద ఉంచి, టోకెన్లు ఇచ్చి, ఫీజు వసూలు చేసే బాధ్యత అప్పగించారు. మరుగుదొడ్లు, దుకాణాల వద్ద ఆసీల వసూలుకు కూడా వీరినే నియమించడంపై విస్మయం వ్యక్తమైంది. అంతేకాక.. విధుల్లో ఉన్నట్లు ఫొటోలు కూడా తీసి గ్రూపుల్లో అప్‌లోడు చేయాలని ఆదేశాలివ్వడంపై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకుని, ఏం పని చేస్తున్నామో అర్థం కావ డం లేదని వారంతా వాపోయారు. సచివాల య వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగానే ఇటువంటి విధానాలను ప్రభుత్వం అవలంబిస్తుందా? అని ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.


