గిరిజన గురుకులాలకు ఆహ్వానం
షెడ్యూల్ ఇది..
● ఐదు, ఆరు తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ● ఏకలవ్య, గిరిజన గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ ● వచ్చేనెలాఖరు వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ● ఏప్రిల్ 4న ప్రవేశపరీక్ష
సీతంపేట:
గిరిజన గురుకులాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గిరిజన గురుకులాల కార్యదర్శి మణికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన గురుకులాల్లో ఐదోతరగతి, ఏకలవ్యమోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలు నిర్వహించనున్నారు. రాతపరీక్ష ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. పార్వతీపు రం ఐటీడీఏ పరిధిలో భద్రగిరి, పి.కోనవలస, కొమరాడ, కురుపాం గురుకుల పాఠశాలలో ఐదోతరగతిలో 320 సీట్లు భర్తీ చేయనున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో పెద్దమడి, సీతంపేట బాలురు, బాలికల పాఠశాలల్లో 80 సీట్లు చొప్పున మొత్తం 240 సీట్లు భర్తీ చేయనున్నారు. వాటిలో ఒక్కో పాఠశాలలో ఐదవ తరగతిలో 80 సీట్లకు గాను ఎస్టీకి 78 శాతం, ఓసీకి 2 శాతం, ఎస్సీ 12 శాతం, బీసీ 5 శాతం, ఏఈక్యూ (ఏజెన్సీ ఎంప్లాయికోటా) 3 శాతం సీట్లు కేటాయించారు.
ఏకలవ్య పాఠశాలల్లో ఇలా..
ఏకలవ్యపాఠశాలల్లో మెళియాపుట్టి, భామిని,అనసభద్ర, కొటికపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం కోఎడ్యుకేషన్‌లో బాలురు 30, బాలికలు 30 ఒక్కో పాఠశాలకు 60 సీట్లు చొప్పున ఆరు పాఠశాలల్లో 360 సీట్లు భర్తీ చేయనున్నారు. రాతపరీక్షలో ప్రతి భావంతులైన వారికి, వారి మార్కులు రిజర్వేషన్ ప్రకారం ప్రవేశం కల్పించనున్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి...
విద్యార్థులు ఆన్‌లైన్‌లో డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ. ఏపీటీడబ్ల్యూగురుకులం.ఏపీ.గవ్.ఇన్‌లో దరఖాస్తు చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించరాదు. ఐదోతరగతిలో ప్రవేశానికి 4 వతరగతిని ప్రభుత్వ పాఠశాలలు, రికగై్‌న్‌జ్డ్ స్కూల్స్‌లో చదివి ఉండాలి.ఆరోతరగతిలో ప్రవేశానికి ప్రభుత్వపాఠశాలలు, గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి 2025–26లో పాసై ఉండాలి.
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 5.2.2026
దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది: 28.2.26
హాల్‌టిక్కెట్ డౌన్‌లోడింగ్: 10.3.26
ప్రవేశపరీక్ష తేదీ: 4.4.2026
మెరిట్ జాబితా తయారీ : 24.4.2026
విద్యార్థికి సమాచారం ఇచ్చేతేదీ: 29.4.26
మొదటి కౌన్సెలింగ్ తేదీ : 9.5.26
రెండో విడత కౌన్సెలింగ్: 24.5.26
మూడో కౌన్సెలింగ్: 10.6.26


