గిరిజనం చీకూచింత | - | Sakshi
Sakshi News home page

గిరిజనం చీకూచింత

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

గిరిజ

గిరిజనం చీకూచింత

త్వరలో మార్కెట్‌కు చింతపండు

దిగుబడి తగ్గింది

ఆరంభమైన చింతపండు సీజన్‌

కాపుకొచ్చిన చెట్లు

పెరగని దిగుబడులు

జీసీసీ మద్దతు ధర రూ.36

కాపు కాయక, దిగుబడి రాక, మద్దతు ధర లేక, దళారులకు అమ్ముకోలేక గిరిజనం తీరని వేదన అనుభవిస్తున్నారు. ఏటా ప్రకృతి ఫలసాయాలను సేకరించి మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించి జీవనం సాగించే గిరిజనులను వారి ఫలసాయాలకు వచ్చే దిగుబడులు ఉసూరుమనిపిస్తున్నాయి. ఈ ఏడాది చింతపండు సీజన్‌ ఆరంభమైంది. దిగుబడి తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఏజెన్సీ గిరిజనం ఆందోళన చెందుతున్నారు.

సీతంపేట: మన్యం జిల్లా చింతపండు మార్కెట్‌లోకి త్వరలో రానుంది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చింతకాయలు అరకొరగా పక్వానికి వచ్చాయని గిరిజనులు తెలిపారు. ధరలు పెరిగినా చింతపండు దిగుబడి లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి చింతపండు దిగుబడి అవుతుంది. గిరిజనులు కొండకోనల్లో ఉన్న చెట్లు ఎక్కి చింతపండు బొట్లను సేకరించి కిందికి దించి వలిచి వాటిని సంతలకు కావిళ్లలో తీసుకువచ్చి విక్రయిస్తారు. గడిచిన మూడేళ్లుగా చింత చెట్ల కాపు పెద్దగా లేకపోవడం, చింతపంట ధరలు పడి పోవడంతో సరైన ఆదాయమార్గాలు గిరిజనులకు లేవు. గతేడాది కొన్ని చోట్ల పండిన చింతపండును కావిళ్ల వంతున రూ.1800 వరకు విక్రయించారు. కావిడలో దాదాపు 25 నుంచి 30 కిలోల చింత పండు ఉంటుంది. అంటే కిలో సరాసరి రూ.80 వరకు ధర పలికింది. ఏజెన్సీలో సుమారు 30 వేల వరకు చింత చెట్లు ఉంటాయి. వావీటిలో సగానికి పైగా చెట్లు కాయని పరిస్థితి ఉంది. ప్రతి ఏటా 50 టన్నుల వరకు ఉత్పత్తి అయ్యేది. గడిచిన రెండేళ్లుగా పదిటన్నుల లోపే దిగుబడి వస్తోంది. ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందని అంచనా. ప్రస్తుతం కావిడ రూ.1500 వరకు విక్రయిస్తున్నారు.

జీసీసీ కిలో రూ.36 మద్దతు ధర..

గిరిజన సహకార సంస్థ ప్రతి ఏటా ఈ సీజన్‌లో మద్దతు ధరలు ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం కిలో చింతపండు రూ.36గా ప్రకటించింది. గతసంవత్సరం రూ.34.20 పైసలు ఉండగా ఈసంవత్సరం రెండు రూపాయలు పెంచి కొనుగోలుకు సన్నద్ధమవుతోంది. మన్యంలో దొరికే చింతపండును సేకరించి గ్రేడింగ్‌ చేసి ప్యాకెట్ల రూపంలో తయారు చేసి కిలోల వంతున మార్కెట్లో జీసీసీ విక్రయిస్తుంది. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, వసతి గృహాలకు ఈ చింతపండును సరఫరా చేస్తుంది. కాగా జీసీసీ మద్దతు ధరలు తక్కువగా ఉన్నాయంటూ మైదాన ప్రాంతాల వ్యాపారులకు గిరిజనులు చింతపండు విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి చింతపండు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది గ్రామాల్లో అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేసిన పరిస్థితులున్నాయి. ఈ ఏడాది కూడా దిగుబడి తగ్గినప్పటికీ అరకొరగా చింతపండును మైదాన వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది.

మార్కెట్‌లోకి మంచి నాణ్యత గల చింతపండు తీసుకువస్తే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంతల్లో కాటాలు ప్రతివారం వేస్తాం. మహాశివరాత్రి తరువాత మార్కెట్‌కు చింతపండు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమ సంస్థకూడా ఈ ఏడాది మద్దతు ధరలు పెంచింది. ఆ ప్రకారం కొనుగోలు చేయనున్నాం.

–దాసరి కృష్ణ, జీసీసీ మేనేజర్‌, సీతంపేట

చింతపండు దిగుబడి తగ్గింది. ధరలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో ఎక్కువగా చింతపండును మార్కెట్లో విక్రయించే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. చింతచెట్లు ముదిరిపోయి పాడయ్యాయి. ఎక్కడో ఉంటే మాకు ఏడాది పొడవునా సొంతానికి వాడుకోవడానికి సరిపోతాయి. ఒక వేళ మిగిలితే విక్రయిస్తాం.

–ఎస్‌.షోడంగ, చింతాడ

గిరిజనం చీకూచింత1
1/3

గిరిజనం చీకూచింత

గిరిజనం చీకూచింత2
2/3

గిరిజనం చీకూచింత

గిరిజనం చీకూచింత3
3/3

గిరిజనం చీకూచింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement