15 నుంచి గ్రామీణ యూత్‌ ఫెస్టివల్‌ | - | Sakshi
Sakshi News home page

15 నుంచి గ్రామీణ యూత్‌ ఫెస్టివల్‌

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

15 నుంచి  గ్రామీణ యూత్‌ ఫెస్టివల్‌

15 నుంచి గ్రామీణ యూత్‌ ఫెస్టివల్‌

టీచర్లను విద్యేతర పనుల నుంచి తప్పించాలి రామతీర్థంలో వైభవంగా స్వామివారి చక్రస్నానం

సీతంపేట: ఈనెల 15 నుంచి 19 వరకు సీతంపేట మండలంలోని సీదిగ్రామంలో మీటదుర్గ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం ప్రాంగణంలో గ్రామీణ యూత్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు మన్యం ప్రగతి సంస్థ చైర్మన్‌ గేదెల రవి తెలిపారు. ఈ మేరకు పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. యూత్‌ ఫెస్టివల్‌లో వాలీబాల్‌, షటిల్‌, చెస్‌, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. పోటీల్లో విజేతలకు ఆకర్షణీయమైన నగదు పురస్కారాలు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9866181612, 7075689035, 7093440359 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మన్యం ప్రగతి సంస్థ కార్యదర్శి గేదెల జనార్దనరావు, మీనక ఉమామహేశ్వరరావు, గేదెల వినయ్‌, మూటక శశికర్‌, నిమ్మక సాయి, ఆరిక కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ కోసం వెబ్‌ సైట్‌లో

అర్జీల నమోదు

పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్‌ సైట్‌లో నమోదు చేయవచ్చని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నామని తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు సెల్లార్‌లో ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయులను విద్యేతర పనుల నుంచి పూర్తిగా తప్పించాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల భానుమూర్తి డిమాండ్‌ చేశారు. స్థానిక ఏపీ ఎన్‌జీఓ భవనంలో ఆదివారం జరిగిన జిల్లా శాఖ విస్తృత కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులపై అనవసర భారం మోపడం వల్ల విద్యాబోధన దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి దవళి సరస్వతి మాట్లాడుతూ ఉపాధ్యాయులపై ఉన్న ఒత్తిడిని తగ్గించి విద్యాబోధనకు తగిన సమయం కల్పించాలని ఉపా ధ్యాయులకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జరిగిన జిల్లా కమిటీ ఎన్నికల్లో జి ల్లా అధ్యక్షులుగా మజ్జి మదన్‌మోహన్‌, ప్రధా న కార్యదర్శిగా పాల్తేరు శ్రీనివాస్‌ ఎన్నికై నట్టు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా లంక రామకృష్ణ, వై.సీతంనాయుడు, కేవీఏ సత్యనారాయణ, ఎన్‌.శ్రీనివాసరాజు, బొత్స పద్మావతి ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా మర్రాపు శ్రీనివాసరావు, వై.భాస్కరరావు, దాసరి మహేష్‌, శెట్టి శివరావు, బి.త్రినాధ్‌, కె.నాగమణి, కె.సింహాచ లం ఎన్నికై నట్టు తెలిపారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా షేక్‌ బుఖారిబాబు, కర్రి రవి, ఏబీ శ్రీధర్‌నాయుడు, బి.రాజేశ్వరి ఎన్నికయ్యారు. అనంత రం నూతన కమిటీ సభ్యులు ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నారు.

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలను పురష్కరించుకుని చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకులు ఆదివారం వైభవంగా జరిపించారు. వేకువజామున ప్రాతః కాలార్చన పూజలనంతరం ఐదు రోజుల నుంచి జరుగుతున్న హవనాలకు యాగశాలలో పూర్ణాహుతిని కనులపండువగా నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఊరేగింపుగా భాస్కర పుష్కరిణి వద్దకు తీసుకువెళ్లి శ్రీ చక్ర పెరుమాళ్లకు చక్రస్నానం జరిపించారు. అనంతరం స్వామివారికి బాలభోగం, గ్రామ బలిహరణ నిర్వహించారు. సాయంత్రం ధ్వజా అవరోహణం చేప ట్టి తిరుక్కల్యాణ ఉత్సవాలకు ముగింపు పలికారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, దేవస్థాన అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement