సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

సోమవా

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

వేతన జీవుల ఆశలపై నీళ్లు సామాన్యులకు కానరాని సంతోషం

న్యూస్‌రీల్‌

కేంద్ర బడ్జెట్‌ 2026–27 అంకెల గారడీతో వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లింది. ఆకాశాన్ని తాకుతున్న ధరల వేళ.. ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు లేకపోవడం కొండంత ఆశకు గోరంత ఊరట లభించిన చందంగా ఉంది. ఎనిమిదివ వేతన సంఘం ఊసే లేకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. మన్యం వంటి వెనుకబడిన ప్రాంతాల్లోని గిరిజన పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు లేకపోవడం అక్షరానికి అన్యాయం చేయడమే.

– బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి

బడ్జెట్‌లో సామాన్యులకు సంతోషం కనిపించడం లేదు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆదాయ పన్ను శ్లాబ్‌లో మార్పు లేకపోవడం వల్ల తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రమైన ఏపీకి.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇచ్చే ప్రాధాన్యం కూడా లేదు. జిల్లాకు పూర్తిగా కేటాయింపులు లేకపోవడం బాధాకరం.

– వంగల దాలినాయుడు, డీసీసీ అధ్యక్షుడు

సాక్షి, పార్వతీపురం మన్యం: వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో జిల్లాకు పెద్దగా ఒనగూరింది ఏమీ లేదు. ప్రత్యేకించి కేటాయింపులు లేకపోవడం అన్ని వర్గాల వారికి నిరాశ కలిగించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీసుకొచ్చిన బడ్జెట్‌లో కీలకమైన రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధి, గిరిజన విద్యాసంస్థల ప్రకటన లేకపోవడం జిల్లావాసులను నిరుత్సాహానికి గురిచేసింది.

– పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు విద్యాపరంగా కీలకమైన గిరిజన యూనివర్సిటీకి గతంలో కూడా నిధులు కేటాయించారు. ఈ సారి ప్రస్తావన లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన విశ్వవిద్యాలయం పనులు జోరందుకున్నాయి. మెంటాడ–దత్తిరాజేరు మండలాల పరిధిలో సుమారు 550 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ భవనం పనులు ప్రారంభమైనప్పటికీ.. నిధుల లేమి కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 228 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. విజయనగరం సమీపంలోని తాత్కాలిక భవనంలోనే వారికి తరగతులు కొనసాగుతున్నాయి. ఈ బడ్జెట్‌లోనూ నిధులు లేకపోవడం నిర్మాణ పురోగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. వెనుకబడిన పార్వతీపురం మన్యం జిల్లాకు, ఇక్కడి గిరిజనుల కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థల ప్రకటన ఏమీ లేకపోవడం నిరాశ కలిగించేదే. ప్రతి జిల్లాలో బాలికల వసతిగృహం ఏర్పాటు చేస్తామనడం విద్యార్థినులకు కాస్త ఊరటనిచ్చిన అంశం.

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/3

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/3

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20263
3/3

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement