తెర్లాంలో చోరీ
తెర్లాం: మండల కేంద్రం తెర్లాంలోని ఓ ఇంటిలో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. దీనికి సంబంధించి తెర్లాం ఎస్సై సాగర్‌బాబు మంగళవారం తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కందుల పైడిరాజు కుటుంబంతో కలిసి ఈనెల 25న తన అత్తవారింటికి వెళ్లాడు. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి తలుపులు తీయగా బీరువా తెరిచి ఉండడం, అందులో ఉంచిన రూ.50వేలు నగదు లేకపోవడంతో దొంగతనం జరిగిందని నిర్ధారణకు వచ్చి లబోదిబోమని విలపించాడు. దొంగలు ఇంటి వెనుక భాగంలో ఉన్న కిటికీ అద్దాలు పగలగొట్టి, గ్రిల్స్ తీసి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చిందరవందర చేసి చివరకు బీరువా పగలగొట్టి అందులో ఉన్న నగదు తీసుకుని వెళ్లిపోయారు. ఇదే విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్‌ను రప్పించి తనిఖీ చేయించారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


