నెల్లిమర్ల మండలంలో..
నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ జరజాపుపేట (లక్ష్మీదేవిపేట)కు చెందిన విసినిగిరి గౌరీ శంకర్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ)గా ఎంపిక య్యాడు. ప్రాథమిక విద్య ఉన్నత పాఠశాల విద్య జరజాపుపేట లో పూర్తి చేసిన గౌరీ శంకర్ ఏలూరులో ఇంటర్ విద్య పూర్తి చేశాడు. అనంతరం 2003లో ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగానికి ఎంపికై 2023లో ఉద్యోగ విరమణ చేశాడు. తాజాగా గ్రూప్ 2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గౌరీ శంకర్ తండ్రి విసినిగిరి అప్పలనాయుడు నెల్లిమర్ల జూట్ కార్మికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి లక్ష్మి గృహిణి.


