ఎవరిదీ పాపం..?
పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మున్సిపల్ కార్యాలయ ఏరియాల్లోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో ఈ హోర్డింగులను ఏర్పాటు చేశారు. దీనిపై పేరు, ఊరు ముద్రించనప్పటికీ.. కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ నాయకుల పనేనని ప్రజలంతా అనుమానిస్తున్నారు. జన సంచారం అధికంగా ఉన్న రద్దీ కూడళ్లలో.. మున్సిపల్ అధికారులకు తెలియకుండా, ప్రజలను రెచ్చగొట్టేలా భారీ స్థాయిలో హోర్డింగులు ఏర్పాటు చేసే ధైర్యం ఎవరికి ఉంటుందని.. అధికార పార్టీ అండతోనే ఇవి వెలిశాయని అంటున్నారు. కోట్లాది మంది మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ విషయంలో విష ప్రచారం చేస్తూ.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వెలిసిన ఈ హోర్డింగులపై మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లు వదిలేయడం గమనార్హం.


