డైరీల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

డైరీల ఆవిష్కరణ

Feb 1 2026 3:35 AM | Updated on Feb 1 2026 3:35 AM

డైరీల

డైరీల ఆవిష్కరణ

డైరీల ఆవిష్కరణ

విజయనగరం ఫోర్ట్‌: కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ అధికారుల సంఘం 2026 డైరీని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. వ్యవసాయ అధికారులకు తమ విధి నిర్వహణలో ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు కె.ప్రకాష్‌, సెక్రటరీ మజ్జి శ్యాంసుందర్‌, సంఘం కోశాధికారి బి.శ్యామ్‌కుమార్‌, వ్యవసాయ అధికారులు సుధ, మాధవి పాల్గొన్నారు.

డైరీని ఆవిష్కరించిన కమాండెంట్‌ రవిశంకర్‌రెడ్డి

డెంకాడ: రాష్ట్ర పోలీస్‌ అసోషియేషన్‌ డైరీని చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌ కమాండెంట్‌ వై.రవిశంకర్‌రెడ్డి ఆవిష్కరించారు. బెటాలియన్‌లోని కమాండెంట్‌ కార్యాయలంలో శనివారం జరిగిన కార్యక్రమంలో డైరీని ఆయన ఆవిస్కరించారు. కార్యక్రమంలో అడిషినల్‌ కమాండెంట్‌ సి.రాజారెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్‌లు ప్రభాకర్‌, లక్ష్మీనారాయణ, బాపూజీ, గోపాలకృష్ణ, ఆర్‌ఐలు రవీంద్ర, గణేష్‌, రామజోగినాయుడు, శ్రీను, చంద్రశేఖర్‌, సమర్పణరావు, సుధాకర్‌బాబు, బెటాలియన్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు మిత్తిరెడ్డి అప్పలనాయుడు, ట్రెజరర్‌ పీవీఆర్‌ మూర్తి, జాయింట్‌ సెక్రెటరీ సత్యనారాయణ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు రాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.

డైరీల ఆవిష్కరణ1
1/1

డైరీల ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement