ఒడిశా పోలీసులపై గిరిజనం తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

ఒడిశా పోలీసులపై గిరిజనం తిరుగుబాటు

Jan 30 2026 6:43 AM | Updated on Jan 30 2026 6:43 AM

ఒడిశా

ఒడిశా పోలీసులపై గిరిజనం తిరుగుబాటు

ఒడిశా పోలీసులపై గిరిజనం తిరుగుబాటు ● ప్రజల్లో చైతన్యం వచ్చినా పట్టించుకోని ప్రభుత్వం బక్కుపేట మెట్టపై ఏనుగుల గుంపు

సాలూరు రూరల్‌: ఆంధ్రా, ఒడిశా వివాదాస్ప ద కొఠియా గ్రామాల్లో నిత్యం ఒడిశా అధికారులు ఆంధ్రా ఉద్యోగులపై దౌర్జన్యానికి దిగుతు న్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం అధికారులకు అండగా ఒక్క పోలీసును కూడా పంపించిన డాఖలాలు లేకపోవడంతో అక్కడి గిరిజనులే ఒడిశా పోలీసులపై గురువారం తిరగబడ్డారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గురువారం సచివాలయ సిబ్బంది యూఎస్‌ఎఫ్‌ సర్వే చేసేందుకు కొఠియా గ్రామాలకు వెళ్లగా ఒడిశా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో సచి వాలయ సిబ్బందికి అండగా అక్కడి గిరిజనులు నిలబడి ఒడిశా పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో చేసేది లేక ఒడిశా పోలీసులు వెనుదిరిగారు. అనంతరం గంజాయిభద్ర వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ మధుబాల, ఏఎన్‌ఎం కవిత తమ సర్వేను నిర్వహించారు. ఇదిలా ఉండగా అంధ్రా అధికారులను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న ఒడిశా అధికారుల తీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో అక్కడి గిరిజనుల్లో అభద్రతా భావం కలుగుతోందని పలు గిరిజన సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికై నా వివాదాస్పద గ్రామాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్లయం తీసుకోవాలని స్దానిక గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు.

సీతానగరం: ఏనుగుల గుంపు బక్కుపేట మెట్ట (కొండపై)పై గురువారం సంచరించినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగులను కవ్వించవద్దని ప్రజలకు సూచించారు. ఏనుగు ల గుంపును ఎప్పటి కప్పుడు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.

డ్రైవర్లకు కంటిచూపు పరీక్షలు తప్పనిసరి

ఉపరవాణా కమిషనర్‌ డి.మణికుమార్‌

విజయనగరం టౌన్‌: వాహనాలు నడిపే డ్రైవర్లందరూ తప్పనిసరిగా కంటిచూపు పరీక్షలు చేయించుకోవాలని ఉపరవాణా కమిషనర్‌ డి.మణికుమార్‌ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో డ్రైవర్లకు ఆరోగ్య, కంటిచూపు పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మోటారు వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు యు.దుర్గాప్రసాద్‌, ఎం.శశికుమార్‌, శ్రావ్య, రమేష్‌కుమార్‌, నవీన్‌ కుమార్‌, ఐశ్వర్య, ప్రభుత్వాస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.

ఒడిశా పోలీసులపై  గిరిజనం తిరుగుబాటు
1
1/1

ఒడిశా పోలీసులపై గిరిజనం తిరుగుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement