81.90 కేజీల గంజాయి స్వాధీనం
చికెన్
పూసపాటిరేగ: మండలంలోని గోవిందపురం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో 81.90 కేజీలు గంజాయి, మూడు కార్లు, ఒక కంటైనర్‌ను సీజ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలోని సిమిలిగూడ నుంచి ఏడు బస్తాల్లో 81.90 కిలోలు గంజాయిని కంటైనర్‌లో తరలిస్తుండగా పోలీసులు వెంబడిస్తున్నారనే సమాచారంతో గోవిందపురం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో కంటైనర్ నుంచి కారులోకి గంజాయిని ఎక్కిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామిలి జిల్లాకు చెందిన అక్రమ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాకు చెందిన రాహుల్‌కుమార్, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేడబోయిన తులసీదాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.4.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కార్యక్రమంలో ఎస్సై ఐ.దుర్గాప్రసాద్, ఏఎస్సై సురేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
మూడు కార్లు, ఒక లారీ సీజ్
పోలీసుల అదుపులో ముగ్గురు
నిందితులు
కంటైనర్ నుంచి కారులోకి
గంజాయి బస్తాలు మారుస్తుండగా పట్టివేత


