మక్కువ మండలంలో ఇద్దరు | - | Sakshi
Sakshi News home page

మక్కువ మండలంలో ఇద్దరు

Jan 29 2026 6:37 AM | Updated on Jan 29 2026 6:37 AM

మక్కు

మక్కువ మండలంలో ఇద్దరు

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

మక్కువ: మండలంలోని శంబర గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రూప్‌–2 ఉద్యోగాలు సాధించారు. గ్రామానికి చెందిన ఆర్నిపల్లి సంతోష్‌కుమార్‌ అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించడంతో గ్రామానికి చెందిన ఉద్యోగసంఘం సభ్యులు స్వీట్లు తినిపించి, అభినందనలు తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన గంట భానుప్రసాద్‌ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించడంతో, ఆయన తల్లిదండ్రులను గ్రామానికి చెందిన ఉద్యోగసంఘం సభ్యులు దుశ్శాలువాతో సన్మానించారు.

కొత్తవలస: మండలంలోని తుమ్మికాపల్లి పంచాయతీ జగన్నాథ లేఅవుట్‌ లో గల సాయిసంపత్‌ అపార్ట్‌మెంట్‌లో రాజుపాత్రునిపాలెం గ్రామానికి చెందిన వానపల్లి సోమేశ్వరరావు (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సోమేశ్వర రావు గాజువాక సమీపంలో గల ఒక టైర్ల షాపులో పనిచేస్తూ రోజు ఇంటి నుంచే రాకపోకలు సాగిస్తుంటాడు. మంగళవారం తన తల్లి దగ్గర డబ్బులు తీసుకుని బస్‌ పాస్‌ చేయించుకునేందుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. కాగా మంగళవారం రాత్రి తన తల్లికి ఫోన్‌ చేసి తన మిత్రుడు కె.ఆశోక్‌కుమార్‌ అపార్ట్‌మెంట్‌లో నిద్రిస్తానని చెప్పి అపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయాడు. కాగా ఉదయం మిత్రుడు లేపేందుకు ప్రయత్నించగా కదలిక లేకపోవడంతో చెంతనే గల ఆర్‌ఎంపీ డాక్టర్‌కు చూపించగా అప్పటికే మృతి చెందినట్లు ఆర్‌ఎంపీ ధ్రువీకరించాడు. సోమేశ్వరారావు మృతి అనుమానంగా ఉందని మృతుడి తల్లిదండ్రులు, సోదరులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షన్ముఖరావు తెలిపారు.

గజపతినగరం: మండలంలోని బూడిపేట గ్రామానికి చెందిన మజ్జి పెంటయ్య (75)ఆయాసం, బీపీ, సుగర్‌, కీళ్ల నొప్పులు తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర మానసిక ఒత్తడికి గురై 2నెల 26న పురుగు మందు తాగేశాడు. దీంతో పెంటయ్యను కుటుంబసభ్యులు విజయనగరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. పెంటయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అలాగే సాలిపేట గ్రామానికి చెందిన కొడిసి ఆదినారాయణ (46) ఈనెల 26న చింత చెట్టు ఎక్కి చింతబొట్లు రాలుస్తూ ప్రమాదవశాత్తు చెట్టునుంచి కిందకు జారి పడడంతో నడుమ వద్ద తీవ్ర గాయం కాగా కుటుంబసభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌ కుమార్‌ నాయుడు తెలిపారు.

దత్తిరాజేరు మండలంలో ఇద్దరు..

దత్తిరాజేరు: మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన సుంకరి సురేష్‌ గ్రూప్‌ 2 ఫలితాల్లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌ఓ)గా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సురేష్‌ తండ్రి అప్పన్న ఇటీవల మృతి చెందిగా తల్లి లక్ష్మితో కలిసి కోమటిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అలాగే ఎస్‌.చింతలవలస గ్రామానికి చెందిన అల్తివాసు డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వాసును తల్లి రామలమ్మ కష్టపడి చదివించడంతో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. 2019లో కానిస్టేబుల్‌, 2022లో రైల్వేలో ఉద్యోగాలు సాధించి తొలి ప్రయత్నంలోనే వచ్చిన ఉద్యోగాలను వదులుకుని మరింత పట్టుదలతో చదవడంతో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు.

మక్కువ మండలంలో ఇద్దరు 1
1/4

మక్కువ మండలంలో ఇద్దరు

మక్కువ మండలంలో ఇద్దరు 2
2/4

మక్కువ మండలంలో ఇద్దరు

మక్కువ మండలంలో ఇద్దరు 3
3/4

మక్కువ మండలంలో ఇద్దరు

మక్కువ మండలంలో ఇద్దరు 4
4/4

మక్కువ మండలంలో ఇద్దరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement