పొలాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు
సీతానగరం: మండలంలోని వివిధ గ్రామాల పొలాల్లో ఐదు రోజులుగా 8 ఏనుగుల గుంపు సంచరిస్తున్నందున ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం రామవరం, ఆర్.వెంకంపేట గ్రామాల్లోని పొలాల్లో పగటిపూట ఏనుగులు సంచరించాయి.రబీ సీజన్‌లో రైతులు సాగు చేస్తున్న పంటను ధ్వంసం చేయడంతో కళ్లాల్లో రైతులు గడ్డి వాముల్లో భధ్రపర్చుకున్న ధాన్యం బస్తాలను పసిగట్టి తినేస్తున్నాయి. మిగతా ధాన్యం చిందరవందర చేస్తున్నాయి. ఏనుగుల గుంపును పసిగట్టేందుకు వచ్చిన అటవీశాఖ, పోలీస్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా ఏనుగుల రాకపోకలను గమనిస్తూ ఆయాగ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


