ఫలించిన అధికారుల కృషి | - | Sakshi
Sakshi News home page

ఫలించిన అధికారుల కృషి

Jan 28 2026 8:27 AM | Updated on Jan 28 2026 8:27 AM

ఫలించ

ఫలించిన అధికారుల కృషి

–8లో

–8లో
దారులన్నీ జనసంద్రమే.. ఎటు చూసినా కనుచూపు మేర ‘శంబర’మే. చల్లని తల్లి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. గిరిజనుల కొంగుబంగారం పోలమాంబ... వనాన్ని వీడి, జనంలోకి వచ్చింది. తన భక్తజనం జేజేలు చూసి మురిసింది. 30 అడుగుల సిరిమానుపై పూజారి రూపంలో ఠీవీగా ఆసీనులై, పురవీధుల్లో ఊరేగింది. చల్లని చూపుతో ఆశీర్వచనాలు అందజేసింది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా తిలకించిన భక్తకోటి ఆనందంతో పులకించిపోయింది.

బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026

సాక్షి, పార్వతీపురంమన్యం/మక్కువ/పార్వతీపురం రూరల్‌: ఉత్తరాంధ్రుల కల్పవల్లి, చల్లనితల్లి శంబర పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తుల విశ్వాసం చూరగొన్న పోలమాంబను చూసి తరించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు పొరుగున్న ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు ఆర్టీసీ బస్సులతోపాటు, ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. మక్కువ మండలం శంబర గ్రామంలో వెలసిన పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలిరాగా.. భక్తులు జయజయధ్వానాల నడుమ శంబర గ్రామం పులకించింది.

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సిరిమానోత్సవాన్ని ప్రారంభించాలని భావించిన అధికారులు.. అనుకున్న సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా చేయలేకపోయారు. గ్రామపెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లోపించడంతో ఘటాలను తీసుకురావడంలో జాప్యమైంది. సాయంత్రం 4.20 నిమిషాలకు పూజారి జన్నిపేకాపు భాస్కరరావు అలియాస్‌ జగదీశ్వరరావు సిరిమానును అధిరోహించారు. దీంతో ఏటా నిర్వహించిన సమయం కంటే సుమారు గంట సమయం ఆలస్యంగా ఈ ఏడాది ఉత్సవం మొదలైంది. పురవీధుల్లో ఊరేగిన అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రధానాలయం సమీపంలోకి సిరిమాను చేరుకుంది.

ముందుగా జన్నివారి ఇంటి నుంచి ఘటాలను అమ్మవారి ఆలయంలోకి తీసుకొచ్చి, పూజలు నిర్వహించారు. అనంతరం సిరిమాను ఉండే ప్రదేశానికి తీసుకువచ్చారు. ప్రధానాలయం నుంచి అమ్మవారు వచ్చే మార్గంలో నేలపై చీరలను పరిచి.. వాటిపై చిన్నారులను పడుకోబెట్టారు. వారిపై అమ్మవారి ఘటాలు దాటుతూ వెళ్లడంతో భక్తులు పులకించిపోయారు. జన్నివారి ఇంటి నుంచి అమ్మవారి ఘటాలను గిరడ వారింటికి, ఆ తర్వాత మునసబు, కరణం ఇళ్లకు తీసుకువెళ్లి పూజలు జరిపించారు. రాత్రంతా అమ్మవారి ఘటాలు గ్రామంలో తిరువీధి చేసి, బుధవారం ఉదయం 10 గంటల సమయానికి ప్రధాన రహదారి వద్ద అమ్మవారి గద్దెకు చేరుకుంటాయి. ఆ ప్రదేశంలో అమ్మవారి ఘటాలకు ఉయ్యాల కంబాల కార్యక్రమం నిర్వహించి, అనుపోత్సవంలో భాగంగా అమ్మవారి ఘటాలను వనంగుడికి తీసుకువెళ్తారు.

అమ్మవారి జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ఎస్పీ మాధవ్‌రెడ్డి పర్యవేక్షణలో 683 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తుకు వినియోగించారు. రోప్‌ పార్టీ, స్పెషల్‌ పార్టీ, క్రైమ్‌ పార్టీలు ఎవరికి వారిగా విధులు కేటాయించారు. డ్రోన్‌ కెమెరాలతో పాటు.. 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిరిమాను వద్ద రోప్‌ పార్టీ.. భక్తుల తోపులాటలు జరగకుండా నివారించగలిగింది.

పోలమాంబ అమ్మవారికి మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. తొలుత ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతించి, ప్రత్యేక పూజలు జరిపించారు. ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌, వైఎస్సార్‌సీపీ పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు, సాలూరు ఏఎంసీ చైర్‌పర్సన్‌ దండి అనంతకుమారి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, మండలాధ్యక్షుడు మావుడి రంగునాయుడు తదితరులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు.

పోలమాంబకు సమర్పించేందుకు పట్టువస్త్రాలు తీసుకుని వస్తున్న మంత్రి సంధ్యారాణి

సంప్రదాయం ప్రకారం ఘటాలకు పూజలు

తల్లీ.. కరుణించమ్మా..

గతం మాదిరిగానే ఈ ఏడాది కూడా అధికారులు సమన్వయంతో పనిచేసి క్యూలైన్లు ఏర్పాటు, బస్సుల రాకపోకలు, ట్రాఫిక్‌ మళ్లింపు వంటి చర్యలు పక్కాగా అమలు చేశారు. ఉదయం 9.30 గంటల తర్వాత భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్యూలైన్లు సరిపడక భక్తులు ఎండలో బారులు తీరడం కనిపించింది. భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని అధికారులు ముందే ఊహించి, తగిన సౌకర్యాలు కల్పించడంలో అధికారులు సఫలీకతమయ్యారు. మొత్తంగా 220 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. బస్సులన్నీ కిక్కిరిసిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ ఎం.వెంకటేశ్వరావు, సబ్‌కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఏఎస్పీ వి.మనీషారెడ్డి ఆద్యంతం పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలు చేశారు. క్యూలైన్లకు సమీపంలో తలనీలాలు సమర్పించే శిబిరం, అక్కడకు కొద్దిదూరంలోనే కోళ్లు, గొర్రెలు మొక్కులు తీర్చుకొనే ప్రదేశాన్ని కేటాయించారు.

పులకించిన భక్త జనం

ఉత్సవాన్ని తిలకించడానికి రాష్ట్రంలోని నలుమూలలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గతేడాది కంటే.. ఈ సారి అధికారుల అంచనాలను మించి భక్తుల తాకిడి పెరిగింది. 10 వారాల వరకు అమ్మవారి జాతర జరగనున్నప్పటికీ.. ఉచిత బస్సు కారణంతో తొలివారం బాగా భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారు జాము నుంచి ఉదయం 9.30 గంటల వరకు భక్తుల తాకిడి తక్కువగా కనిపించింది. తర్వాత ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో శంబర గ్రామం కిటకిటలాడింది. గ్రామంలోని రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రం కనిపించింది.

పటిష్ట పోలీసు బందోబస్తు

అంబరాన్నంటిన..

సిరిమాను శంబరం

గంట ఆలస్యంగా ప్రారంభమైన

సిరిమానోత్సవం

కనుల పండువగా పోలమాంబ

సిరిమానోత్సవం

శంబర జాతరకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తజనం

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సంధ్యారాణి

శంబరలో సిరిమాను తిరువీధి (ఇన్‌సెట్లో) సిరిమాను అధిరోహించిన పూజారి భాస్కరరావు

ఫలించిన అధికారుల కృషి 1
1/6

ఫలించిన అధికారుల కృషి

ఫలించిన అధికారుల కృషి 2
2/6

ఫలించిన అధికారుల కృషి

ఫలించిన అధికారుల కృషి 3
3/6

ఫలించిన అధికారుల కృషి

ఫలించిన అధికారుల కృషి 4
4/6

ఫలించిన అధికారుల కృషి

ఫలించిన అధికారుల కృషి 5
5/6

ఫలించిన అధికారుల కృషి

ఫలించిన అధికారుల కృషి 6
6/6

ఫలించిన అధికారుల కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement