బాల్య వివాహం చేస్తే రెండేళ్ల జైలుశిక్ష
విజయనగరం ఫోర్ట్: బాల్య వివాహం చేసినా, ప్రోత్సహించినా బాధ్యులకు 2 సంవత్సరాల జైలుశిక్ష, లక్ష రుపాయల జరిమానా విధించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిలుపుదలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీసీపీయూ లక్ష్మి, యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ పీడీ ప్రసాదరావు, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ హిమబిందు, వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేట ర్ పి.సాయి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాంసుందర్ రెడ్డి


