పోలీసు బలగాలకు ‘పునశ్చరణ’
● ఆయుధాల వినియోగం,
● సైబర్ నేరాలపై అవగాహన
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు సాయుధ బలగాలకు 15 రోజుల పునశ్చరణ (మొబిలైజేషన్) తరగతులు మంగళవారం కొనసాగాయి. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బందికి శారీరక దారుఢ్యం, ఆయుధాల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. ఉదయం వేళ వ్యాయామాలు, రన్నింగ్, ఫిట్‌నెస్ డ్రిల్స్‌తో పాటు 9ఎంఎం పిస్టల్ వంటి ఆయుధాలను క్లిష్ట సమయాల్లో వేగంగా, సురక్షితంగా ఉపయోగించే విధానంపై మెలకువలు నేర్పిస్తున్నారు. అనంతరం సైబర్ సెల్ ఎస్సై రవీంద్ర రాజు డిజిటల్ నేరాలపై అవగాహన కల్పించారు. ఆనన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, సోషల్ మీడియా నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పోర్టల్‌ను ఎలా వినియోగించాలో వివరించారు. ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి మాట్లాడుతూ..సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నాయుడు, ఆర్‌ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు బలగాలకు ‘పునశ్చరణ’


