ఎల్.కోట మండలంలో ఒకరు
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన గనివాడ సతీష్ బుధవారం విడుదలైన గ్రూప్–2 పరీక్షా ఫలితాల్లో ఎంపికయాడు. సతీష్ ఇంటర్ తరువాత బీఫామ్ చేసి ప్రస్తుతం ఒక కళాశాలలో ప్రైవేట్‌గా లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సతీష్ తండ్రి సూరిదేముడు విశ్రాంత ఉపాధ్యాయుడు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2కి ఎంపికై న సతీస్‌కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
ఏఎస్‌ఓగా పతివాడ మనీష్
విజయనగరం అర్బన్: ఏపీ గ్రూప్–2 పోస్టుల ఎంపికలో అరుంధతి నగర్ కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పతివాడ మనీష్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్‌ఓ)గా ఎంపికయ్యారు. తండ్రి గోవిందరావు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి గృహిణి.
ఏఎస్‌ఓగా టీచర్ ఎంపిక
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలం కుమరాం పాలవలస గ్రామానికి చెందిన గదుల సాయమ్మ గ్రూప్ 2 ఫలితాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. ఆమె ప్రస్తుతం నెల్లిమర్ల మండలం పారసాం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. 17 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావంతో సేవలు అందిస్తున్న ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ తన లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఆమె భర్త గదుల వెంకటరమణ కూడా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
డిప్యూటీ తహసీల్దార్‌గా జగదీశ్వర రావు
రేగిడి: మండల పరిధిలోని మజ్జిరాముడుపేట గ్రామానికి చెందిన నెల్లి జగదీశ్వరరావు డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆయన కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తండ్రి నెల్లి సూర్యనారాయణ మెడికల్ ప్రాక్టీస్‌నర్.
డిప్యూటీ తహసీల్దార్‌గా
ఆదివాసీ యువకుడు
భామిని: మండలంలోని మనుమకొండకు చెందిన ఆదివాసీగిరిజన యువకుడు కుంబిరిక జయప్రకాష్ గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపిక కావడంపై సర్వత్రా హర్షం వెల్లువెత్తుతోంది. నిరుపేద ఆదివాసీ దంపతులు కుంబిరిక రమణ, సైంబీర్‌ల వ్యవసాయ కూలీలు వారి తనయుడు శ్రమించి చదివి ఉద్యోగం సాధించాడు.
ఎల్.కోట మండలంలో ఒకరు
ఎల్.కోట మండలంలో ఒకరు
ఎల్.కోట మండలంలో ఒకరు
ఎల్.కోట మండలంలో ఒకరు


