36 తులాల బంగారం చోరీ
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామంలో ఆదివారం పట్టపగలే బంగారం అపహరించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకటరమణ, ముత్యాలమ్మలు ఉదయం పొలంలో పెసర మొక్కలు తీయడానికి వెళ్లారు. 11గంటల సమయంలో వెంకటరమణ కళ్లంలో అవును శాలలో కట్టడానికి వచ్చి కళ్లం పక్కనే ఉన్న తన ఇంటికి దాహం తీర్చుకోవడానికి వెళ్లేసరికి ఇంటి తలుపులు తీసి ఉండడంతో అవాకై ్క ఇంట్లోకి వెళ్లి చూడగా తన గోడబీరువా (కప్‌బోర్డు) పగులగొట్టి అందులో ఉన్న బంగారం దోచుకున్నట్లు గుర్తించి. భార్యకు కబురుపెట్టగా ముత్యాలమ్మ ఇంటికి వచ్చి లబోదిబోమంది. బీరువాలో పెట్టిన నెక్లెస్, చైన్లు, ఉంగరాలు, బ్రాస్‌లెట్, చెవులరింగులు, ఎత్తుగొలుసు, నల్లపూసలు, హారంతోపాటు బంగారం కడ్డీ (సుమారు 3 తులాలు) కాసులు 1 తులంతోపాటు మొత్తం 36 తులాలు దుండగులు దోచుకున్నారు. బాధితులు ఈ విషయమై వల్లంపూడి ఎస్సై ఎస్.సుదర్శన్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బందితో ఆయన సంఘటానాస్థలానికి చేరుకుని బాధితులనుంచి వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించగా వారు వచ్చి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై సుదర్శన్ తెలిపారు.


