లక్ష్యం సాధించారు..! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం సాధించారు..!

Jan 29 2026 6:37 AM | Updated on Jan 29 2026 6:37 AM

లక్ష్

లక్ష్యం సాధించారు..!

లక్ష్యం సాధించారు..!

● అభినందిస్తున్న

కుటుంబసభ్యులు,

గ్రామస్తులు

ఉద్యోగాలు

సాధించిన పలువురు

యువత

గ్రూపు–2లో

సత్తా చాటిన జిల్లా అభ్యర్థులు

సాక్షి నెట్‌వ ర్క్‌:

జీవితంలో ఏదో సాధించాలన్న లక్ష్యం ఏర్పరుచుకుని కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించిన పలువురు జిల్లా అభ్యర్థులు ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్‌–2 ఫలితాల్లో సత్తా చాటి ఉద్యోగాలు సాధించాచు. చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామానికి చెందిన టొంపల రాంబాబు గ్రూప్‌–2లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎకై ్సజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం రాంబాబు ఇదే మండలంలోని నిమ్మలవలసలో బీపీఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రాంబాబు తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ చదివించారు. అలాగే మండలంలోని దేవరపొదిలాం గ్రామానికి చెందిన గుణిదపు సురేష్‌ గ్రూప్‌–2లో ప్రతిభ చూపి డిప్యూటీ తహసీల్దార్‌ పోస్టు సాధించాడు. సురేష్‌ తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, సింహాచలం రైతుకూలీలు. అన్నయ్యలు వేణు, భాస్కర్‌లు ఒకరు ఫార్మా కంపెనీలో, మరొకరు గ్రామ సచివాలయంలో పని చేస్తున్నారు.

బొండపల్లిలో ఎకై ్సజ్‌ ఎస్సైలుగా ముగ్గురు

బొండపల్లి: ఏపీపీఎస్సీ గ్రూప్‌2 ఫలితాల్లో బొండపల్లి మండలంలోని మూడు గ్రామాలకు చెందిన ముగ్గురు యువత ప్రతిభ కనబరిచి ఎకై ్సజ్‌ ఎస్సైలుగా ఎంపికయ్యారు. మండలంలోని బిల్లలవలస గ్రామానికి చెందిన చందక ఇందు తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌2 ఎగ్జామ్స్‌ రాసి ఎకై ్సజ్‌ ఎస్సైగా ఎంపికై ంది. ఆమె తల్లిదండ్రులు చందక రాజ్యలక్ష్మి, మృత్యుంజయరావులు వంట పని చేస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివించగా కుటుంబంతో పాటు గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిందని పలువురు అభినందిచారు. అలాగే మండలంలోని ముద్దూరు గ్రామానికి చెందిన బాలి సత్యనారాయణతో పాటు, నెలివాడ గ్రామానికి చెందిన కొమ్మ అనూరాధ ఎకై ్సజ్‌ ఎస్సైలుగా పోస్టులు సాధించారు. మండలంలోని ముగ్గురు ఎకై ్సజ్‌ ఎస్సైలుగా ఎంపిక కావడంతో అయా గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది.

లక్ష్యం సాధించారు..!1
1/3

లక్ష్యం సాధించారు..!

లక్ష్యం సాధించారు..!2
2/3

లక్ష్యం సాధించారు..!

లక్ష్యం సాధించారు..!3
3/3

లక్ష్యం సాధించారు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement