ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..! | - | Sakshi
Sakshi News home page

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..!

Jan 29 2026 6:37 AM | Updated on Jan 29 2026 6:37 AM

ఓరిని

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..!

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..! ● ఆక్రమణల చెరలో సాగునీటి కాలువలు ● పంటలకు నీరందక రైతులు అవస్థలు ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నీటిపారుదల శాఖ

సాగునీటి వనరు నిరుపయోగం

చెక్‌డ్యామ్‌ను అందుబాటులోకి తీసుకురావాలి

● ఆక్రమణల చెరలో సాగునీటి కాలువలు ● పంటలకు నీరందక రైతులు అవస్థలు ● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నీటిపారుదల శాఖ

పాలకొండ:

పాలకొండ, బూర్జ మండలాల్లోని పంట పొలా లకు సాగునీరు అందించే ఓని గెడ్డ వద్ద చెక్‌ డ్యామ్‌ ఆక్రమణల చెరలో చిక్కుకుంది. ఎగువ ప్రాంతంలో కొందరు పూర్తిగా ఆక్రమించడంతో నీరు నిల్వ ఉండడం లేదు. కాలువలను కూడా కబ్జా చేయడంతో సాగునీరు అందక ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

13 వేల ఎకరాలకు నీరు..

ఓని పంచాయతీ విజయరాంపురం గ్రామ సమీపంలో ఓని గెడ్డపై బ్రిటీష్‌ కాలంలో చెక్‌డ్యామ్‌ నిర్మించారు. దీనిద్వారా పాలకొండ మండలంలోని 5 వేల ఎకరాలు, బూర్జ మండలంలోని 8 వేల ఎకరాలకు నీరందించే అవకాశం కల్పించారు. ఈ చెక్‌ డ్యామ్‌ నుంచి ఒక కాలువ ద్వారా హరపురం, పల్లాపురం ప్రాంతాల నుంచి బూర్జ మండలం ఎగువ ప్రాంతాలకు సాగునీరు వస్తుంది. మరో కాలువ నుంచి పాలకొండ ప్రాంతంలోని వెలగవాడ, సింగన్నవలస, పరశురాంపురం తదితర గ్రామాలకు సాగునీరు అందాల్సి ఉంది. సీతంపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలోని కొండల నుంచి నేరుగా చెక్‌డ్యామ్‌లో నీరు చేరడం వల్ల వేసవిలో కూడా సాగునీటికి డోకా ఉండదు.

ఆక్రమణలతో బక్కచిక్కి..

సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణం ఉన్న ఓని చెక్‌ డ్యా మ్‌ ప్రాంతం ప్రస్తుతం పూర్తిగా ఆక్రమణల చెరలో బక్కచిక్కింది. కొండల నుంచి వచ్చిన సారవంతమైన మట్టి ఇక్కడ మేట వేసింది. ఏళ్ల కొద్దీ నిర్వహ ణ లేకపోవడంతో పూర్తిగా దిబ్బలుగా మారింది. దీంతో కొంతమంది పంట పొలాలుగా మార్చుకున్నారు. చెక్‌డ్యామ్‌ ఎగువ భాగం సాగులో ఉండడంతో దీనికి ఉన్న గేట్లు తీసివేసి నీరు నిల్వ ఉండకుండా తొలగిస్తున్నారు. దీనికి తోడు చెక్‌డ్యామ్‌ రాతికట్టుకు ఎటువంటి మరమ్మతులు చేయకపోవడంతో నీరు లీకుల ద్వారా కిందకు వృథాగా పోతుంది.

కాలువల గట్లుదీ అదే పరిస్థితి..

నీటిపారుదల శాఖ అధికారులు కాలువలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పక్కన ఉన్న రైతులు కాలువలను పూర్తిగా అక్రమించుకుంటున్నారు. గట్టును పొలాల్లో కలుపుకొని సాగు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కాలువ గట్టుపై పిచ్చి మొక్కలు పెరిగిపోయి కనీసం నడిచేందుకు కూడా అవకాశం లేకుండా ఉంది.

ఓని గెడ్డ చెక్‌డ్యామ్‌ సహజసిద్ధంగా సాగునీరు అందించే వనరు. ఏళ్ల తరబడి సాగునీరు పుష్కలంగా రైతులకు అందేది. బూర్జ మండలంలో ఎక్కువగా రైతులకు ఈ డ్యామ్‌ నీరు ఆధారం. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాటు రైతుల ఆక్రమణలతో ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి. – కండాపు ప్రసాదరావు,

అభ్యుదయ రైతు, రుద్రిపేట

చెక్‌డ్యామ్‌కు నిధులు మంజూరు చేస్తే రైతులకు ఉపయోగ పడుతుంది. నీటిపా రుదల శాఖ అధికారులు నిధుల లేవని చేతులు ఎత్తేస్తున్నారు. ఆక్రమణలు తొలగించి నీరు నిల్వ ఉంచితే వేసవిలో కూడా రైతులకు సాగునీరు అందుతుంది.

– కమిడి త్రిపురాంతకరావు, ఆయకట్టు రైతు

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..! 1
1/4

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..!

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..! 2
2/4

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..!

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..! 3
3/4

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..!

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..! 4
4/4

ఓరిని.. డ్యామ్‌లనూ వదలరా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement