చెత్తరువు..!
న్యూస్‌రీల్
–8లో
దాగుడుమూతలు..!
దాగుడుమూతా దండాకోర్ ఆటలా ఉంది పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని అధికార యంత్రాంగం,
ఆక్రమణ దారుల తీరు.
బుధవారం శ్రీ 4 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
జాక్టో నాయకుల ఢిల్లీ పయనం
● ఈనెల 5న పార్లమెంట్ మార్చ్
వీరఘట్టం: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(జాక్టో) పిలుపునిచ్చింది. ఈమేరకు ఈనెల 5న ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ నిర్వహించి పలు డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన 40 మంది జాక్టో నాయకులు మంగళవారం ఢిల్లీ బయల్దేరారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే జాక్టో లక్ష్యమని,తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వినిపించేందుకు తామంతా హస్తినకు పయనమయ్యామని జాక్టో నాయకులు తెలిపారు.
కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభం
పార్వతీపురం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి చూపు సమస్యలను దూరం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కళ్లజోళ్ల పంపిణీ చేపట్టింది. గతంలో నిర్వహించిన పరీక్షల్లో దృష్టి లోపం ఉన్నట్లు తేలిన 2,134 మంది విద్యార్థులకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఉచితంగా కళ్లజోళ్లను అందజేస్తున్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ భాస్కరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ద్వారా విద్యార్థులందరికీ కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు వాటిని వినియోగించుకుని కంటిచూపును కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డా.సూర్య కౌశిక్, వైద్య సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
32 మంది సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
సీతంపేట: బయోమెట్రిక్ హాజరు వేయని 32 మంది గ్రామ సచివాలయం సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు మండల ప్రత్యేకాధికారి జి.చిన్నబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బయోమెట్రిక్ హాజరు వేయని వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాకేంద్రంలోని డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర పదేపదే చెబుతూ వచ్చారు. చెత్తశుద్ధి నిర్వహణ అంటూ కొన్నాళ్లు హడావిడి చేసినా..‘చెత్త’ కథ మళ్లీ మొదటికే వస్తోంది. అసంపూర్తి నిర్ణయాల వల్ల ఈ దుస్థితి దాపురించింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోజుకు 25 టన్నుల చెత్త సేకరణ
జిల్లా కేంద్రం పార్వతీపురంలో 30 వార్డులున్నాయి. సుమారు 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. దాదాపు 13 వేల నివాస గృహాలుండగా.. ఆవాసాలు, వ్యాపార సంస్థల నుంచి రోజుకు 25 టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతోంది. పట్టణ శివారులో ఉన్న డంపింగ్ యార్డులోనే దీన్ని పారబోస్తున్నారు. డంపింగ్‌యార్డు 1.5 ఎకరాల్లోనే ఉంది. చెత్తను యార్డుకు తరలించాలని పట్టణ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే విజయ్‌చంద్ర దాన్ని నెరవేర్చలేకపోయారు. గతంలో పార్వతీపురం పట్టణంలోని చెత్తశుద్ధి నిర్వహణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సంస్థ తరుణి ఏజెన్సీకి పనులు అప్పగించింది. ఆ మేరకు కొన్నాళ్ల క్రితం డంపింగ్ యార్డు సమీపంలోనే పనులు ప్రారంభించారు. ఇక్కడ చెత్తను నాలుగు భాగాలు విభజిస్తారు. ప్లాస్టిక్, మట్టిరాళ్లు, రబ్బరు, గాజు వ్యర్థాలను వేర్వేరు యంత్రాలతో విభజించాల్సి ఉంటుంది. ప్లాస్టిక్‌ను విక్రయానికి తరలించి, మిగిలిన పనికిరాని వ్యర్థాలను తిరిగి భూమిలో కలిపేస్తారు. ఇలా పట్టణంలో 12 వేల టన్నుల వరకు వ్యర్థాలను విభజించాలి. ప్రస్తుతం సేకరిస్తున్న చెత్తలో 20 శాతమే(ప్లాస్టిక్ వంటివి) తిరిగి ఉపయోగానికి పనికి వస్తున్నాయి. మిగిలిన 80 శాతం మళ్లీ భూమిలో కలిపేయాల్సి వస్తోంది.
మిగిలిన వ్యర్థాలన్నీ మళ్లీ అక్కడే..
ఇప్పటికే డంపింగ్‌యార్డు సమస్య చాలా కాలంగా ఉంది. పట్టణ శివారు రాయగడ రోడ్డు పక్కనే గుట్టల మాదిరి చెత్త పోగవుతోంది. రహదారిపైకే వస్తోంది. డంపింగ్ యార్డు సమీప స్థలంలోనే చెత్తశుద్ధి నిర్వహణ యంత్రాలున్నాయి. శుద్ధి చేయగా మిగిలిన 80 శాతం వ్యర్థాలను రహదారికి మరోవైపునే కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు పడేస్తున్నారు. దీంతో అదో పెద్ద కొండ మాదిరి తయారై..అటుగా ప్రధాన రహదారిపైకి వస్తోంది. రెండు వ్యర్థాలూ కలిసి అటుగా ప్రయాణించే వారికి నరకం చూపుతున్నాయి. ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్లు.. చెత్తశుద్ధి నిర్వహణ తర్వాత మిగిలిన వ్యర్థాలను పట్టణంలోని నెల్లి చెరువులో కలిపేయడానికి నిశ్చయించుకున్నారు. ఇప్పటికే నెల్లి చెరువు దురాక్రమణలో ఉంది. జిల్లా కేంద్రం నడిబొడ్డున 11.54 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ చెరువు ఆక్రమణల తర్వాత బక్కచిక్కి ఐదెకరాలకే పరిమితమైంది. ఇప్పటికీ ఆక్రమణలు ఆగడం లేదు. ఇప్పుడు చెత్తశుద్ధి వ్యర్థాలన్నింటినీ నెల్లి చెరువులో కలిపేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల చెరువు పూర్తిగా చదును అయిపోతుందని, నామరూపాలు లేకుండా పోతుందని.. ఆక్రమణలు మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకేంద్రంలో కానరాని చెత్తశుద్ధి
రహదారిపైనే వ్యర్థాల ‘డంపింగ్
పార్వతీపురం–రాయగడ రోడ్డులో పేరుకుపోతున్న గుట్టలు
జిల్లా కేంద్రంలోని నెల్లి చెరువులోనూ పారబోసేందుకు ప్రయత్నాలు
అడ్డుకున్న స్థానికులు
బెదిరింపులకు దిగిన అధికారులు
చెత్తరువు..!
చెత్తరువు..!
చెత్తరువు..!


