రోగులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
సీతంపేట: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సూచించారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి.. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రోగులు క్యూలో నిల్చోకుండా బెంచీలు ఏర్పాటు చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. నడవలేని స్థితిలో ఉన్న వారికి వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వారికి సాయం అందించడానికి హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవకుల సంఖ్య పెంచాలన్నారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్, ఏపీఓ చిన్నబాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, తహసీల్దార్ డి.శ్రీకన్య, సూపరిండెంటెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ డి.వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.


