గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా | - | Sakshi
Sakshi News home page

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా

Jan 29 2026 6:37 AM | Updated on Jan 29 2026 6:37 AM

గార్ర

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా

రాజాం: గ్రూపు–2 ఫలితాల్లో రాజాం మండలంలోని గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన తుర్ల దుర్గారావు ఏపీ సెక్రటరీయేట్‌ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. బీటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఉత్తీర్ణత చెందిన ఈ యువకుడు సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు. గత రెండేళ్లుగా సివిల్స్‌పై దృష్టిసారించిన యువకుడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు తుర్ల సూరమ్మ, అప్పన్నలు వ్యవసాయ కూలీలు. రైతు కుటుంబానికి చెందిన దుర్గారావు సివిల్స్‌ సాధించడం పట్ల గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

మెంటాడ మండలంలో నలుగురు

మెంటాడ: మండలానికి చెందిన నలుగురు అభ్యర్థులు గ్రూప్‌ 2 లో విజయం సాధించారు. పిట్టాడగ్రామానికి చెందిన సిరిపురం రేణుక డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికై ంది. ఆమె గతంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పనిచేసింది, జీటీపేటకు చెందిన కెల్ల సత్యవతి ఎకై ్సజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపిక కాగా ఆమె గతంలో జగనన్న ప్రభుత్వంలో వలంటీర్‌గా పని చేసింది. మీసాలపేటకు చెందిన లెంక అరుణ కుమారి డీజీపీ ఆఫీస్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది. ఆమె ఇంటర్‌ అయ్యాక ఆర్థిక ఇబ్బందులతో మూడు సంవత్సరాలు చదువు ఆపేసింది. అన్న బంగారు నాయుడు ప్రోత్సాహంతో డిగ్రీ చదివి ఉద్యోగం సాధించింది. అలాగే కమిషనర్‌ ఆఫ్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ గా చింతలవలసకు చెందిన పిన్నింటి శ్రీపతి ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు ప్రజలు, నాయకులు వారిని అభినందించారు.

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా
1
1/4

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా
2
2/4

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా
3
3/4

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా
4
4/4

గార్రాజు చీపురుపల్లి యువకుడి సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement