–8లో | - | Sakshi
Sakshi News home page

–8లో

Feb 1 2026 3:33 AM | Updated on Feb 1 2026 3:33 AM

–8లో

–8లో

–8లో మత సామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం కురుపాంలో దొంగల హల్‌చల్‌

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 1 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

బాబామెట్టలో ఉన్న హజరత్‌ ఖాదర్‌వలీబాబా 67వ సుగంధ మహోత్సవాలు మూడో రోజు శనివారం అంగరంగ వైభవంగా ముగిశాయి.

కురుపాంలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోయారు. శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు.

సాక్షి, పార్వతీపురం మన్యం:

‘తిరుమల లడ్డూ ప్రసాదానికి చంద్రబాబు చేసింది ఘోర అపచారం. ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు తప్పులు చేశారు.. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకున్నారు. చంద్రబాబు కుట్రల కారణంగా కలిగిన అపచారాల వల్ల రాష్ట్ర ప్రజలకు కష్టం, నష్టం రాకూడదు. అందుకే పాప పరిహార పూజలు చేస్తున్నాం’ అని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. 2024 సెప్టెంబర్‌ 18న కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో.. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రకటన ఒక మహాపాతకం. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడటమే ఈ కుట్రకు పునాదిరాయి. అదే రోజు రాష్ట్రంలో ఈ విష రాజకీయం ఆరంభమైంది. ఇప్పుడు దీనిపై సిట్‌ స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ల్యాబ్‌లలో చేసిన పరీక్షల్లో చంద్రబాబు ఆరోపించినట్టుగా ఎలాంటి జంతువుల కొవ్వు కూడా ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని తేలిపోవడం అందరికీ చాలా సంతోషాన్ని, ఊరటనిచ్చిందని తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో జరిగిన అపచారంపై వైఎస్సార్‌సీపీ జాతీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాప పరిహార పూజలు చేశారు. పాలకొండలో కార్గిల్‌ జంక్షన్‌ సమీపంలో ఉన్న శ్రీ వేకటేశ్వర స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుడు పాలవలస విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో పూజలు జరిపారు. సాలూరులో పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలోను, కురుపాంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేపట్టారు. పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పార్టీ శ్రేణులతో కలిసి శాంతియుత ర్యాలీ చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులతో రోడ్డుపైనే జోగారావు బైఠాయించారు. పోలీసులకు, పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంక్షల నడుమ బెలగాం వేంకటేశ్వర స్వామి ఆలయంలో జోగారావు ప్రత్యేక పూజలు జరిపారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాలని.. వేంకటేశ్వర స్వామి ఈ కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు కోరారు.

ప్లకార్డు ప్రదర్శన

హిందువుల మనోభావాలతో ఆటలా?

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి

తిరుమల లడ్డూ వివాదంపై సిట్‌ స్పష్టతనిచ్చింది

స్వామి వారి ప్రసాదానికి చంద్రబాబు చేసింది ఘోర అపచారం

రాష్ట్ర ప్రజలకు కష్టం, నష్టం రాకూడదనే పాప పరిహార పూజలు

జిల్లాలో వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

పార్వతీపురంలో శాంతియుత ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

–8లో1
1/3

–8లో

–8లో2
2/3

–8లో

–8లో3
3/3

–8లో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement