ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
సీతంపేట: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు కుండంగి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు ఆదివారం సీతంపేటలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల పీఈటీ, పండిట్స్ పదోన్నతులు సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వాలన్నారు. మిగిలిన అన్ని కేడర్ పోస్టులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. మండల యూటీఎఫ్ అధ్యక్షుడు కె.ఆనందరావు మాట్లాడుతూ డీఏ ఎరియర్లు, సర్సీస్ రిజిస్టర్ల వార్షిక ఇంక్రిమెంట్లను ఎంఈవోలు అప్‌డేట్ చేయాలన్నారు. మండల ప్రధాన కార్యదర్శి బి.ఫకీర్ మాట్లాడుతూ ఐఆర్ 30 శాతం, పీఆర్‌సీ కమిటీని వెంటనే ప్రభుత్వం నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఎ.ప్రకాశం, కె.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
డీపీటీసీ ఎస్సై విక్రమరావుకు ఎంఎంఎస్ అవార్డ్
● ప్రకటించిన కేంద్ర హోం శాఖ
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కె.విక్రమరావుకు 2026 మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్(ఎంఎంఎస్) అవార్డును ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఘోష్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రం నుంచి ఎంపికై న 15 మందిలో ఎస్సై విక్రమ రావు తొలిస్థానంలో ఉన్నారు.
ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి


