తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం

తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం

తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తాం

విజయనగరం టౌన్‌: తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామని ఆ శాఖ ఆలిండియా జనరల్‌ సెక్రటరీ వాసిరెడ్డి శివాజీ అన్నారు. నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌, ఎంటీఎస్‌, గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ల ఆధ్వర్యంలో స్థానిక జగన్నాథం కన్వెన్షన్‌ హాల్‌లో 31వ ద్వైవార్షిక మహాసభ ఆదివారం నిర్వహించారు. ప్రస్తుత తరుణంలో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న మార్పులు, ఉనికి, ఉద్యోగుల సమస్యలు రానున్న రోజుల్లో డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగుల స్థితిగతులు, ఎదుర్కోవాల్సిన సవాళ్లు, జీడీఎస్‌ వేతన సంఘం, ప్రమోషన్లు, 8వ వేతన సంఘానికి సమర్పించిన ప్రతిపాదనలపై పోరాటం చేస్తామన్నారు. అందుకు ఉద్యోగులు చేయాల్సిన విధివిధానాలను వివరించారు. కార్యక్రమంలో సర్కిల్‌ సెక్రటరీ సీహెచ్‌ లక్ష్మీనారాయణ, యూనియన్‌ల డివిజనల్‌ అధ్యక్షులు వి.కిరణ్‌కుమార్‌, ఎస్‌.రమేష్‌, పి.ఆర్‌.నాయుడు, కార్యదర్శులు ఎస్‌.సంతోష్‌కుమార్‌, పి.సూరిబాబు, ఎన్‌.పైడినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement