డిప్యూటీ తహసీల్దార్‌గా రాంమనోహర్
బొబ్బిలి రూరల్: మండలంలోని కారాడ గ్రామానికి చెందిన పీవీఎస్ రాంమనోహర్ గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. రాంమనోహర్ బాడంగి ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న పి లక్ష్మణదొర కుమారుడు.
ఏఎస్‌ఓగా రాంబాబు
పాలకొండ రూరల్: మండలంలోని వాటపాగు గ్రామానికి చెందిన గొర్లె రాంబాబు గ్రూప్–2 ఫలితాల్లో ఏపీ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. రాంబాలు తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబీకులు. తన విజయంలో ఇద్దరు అన్నదమ్ములతో పాటు భార్య మహాలక్ష్మి ఎంతగానో ప్రోత్సహించినట్లు రాంబాబు తెలిపారు.
డిప్యూటీ తహసీల్దార్‌గా రాంమనోహర్


