అర్జీలను పరిష్కరించకుంటే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీలను పరిష్కరించకుంటే కఠిన చర్యలు

Jan 29 2026 6:37 AM | Updated on Jan 29 2026 6:37 AM

అర్జీలను పరిష్కరించకుంటే కఠిన చర్యలు

అర్జీలను పరిష్కరించకుంటే కఠిన చర్యలు

అర్జీలను పరిష్కరించకుంటే కఠిన చర్యలు ● అధికారులకు కలెక్టర్‌ హెచ్చరిక

గరుగుబిల్లి: ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు నాణ్య మైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మండలంలో బుధవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు పలు గ్రామాల నుంచి 83 వినతులు వచ్చాయి. ఇందులో రెవెన్యూకు సంబంధించి అధిక వినతులు వచ్చాయి. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీల సమస్యలను గడువులోగా పరిష్కరించకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, తహసీల్దా ర్‌ పి.బాల, ఎంపీడీఓ జి.పైడితల్లితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలి

కొమరాడ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరె డ్డి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ను బుధవారం నిర్వహించారు. ఎమ్మె ల్యే జగదీశ్వరి, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలితో కలిసి వినతులు స్వీకరించారు. మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement